విప్రో లో ఉద్యోగాలు ఇప్పిస్తాన‌ని రూ.2 కోట్ల మోసం

హైదరాబాద్: ప్ర‌ముఖ ఐటీ కంపెనీ విప్రో లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిసానని చెప్పి అమయాకులను మోసం చేసిన గుణ చంద్రశేఖర్ అనే వ్య‌క్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. న‌గ‌రంలోని కేపీహెచ్‌బీలో విన్సర్ సాఫ్ట్ టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ నీ పెట్టిన చంద్ర‌శేఖ‌ర్.. 70 మంది నిరుద్యోగులను మోసం చేశాడు. ఫేక్ ఇంటర్వ్యూ లు నిర్వహించి, ఫేక్ లెటర్ లు సృష్టించి.. ఒక్కోక్కరి నుంచి 2 లక్షల వరకు వసూలు చేసి, మొత్త‌మ్మీద 2 కోట్లు కాజేశాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న సైబ‌రాబాద్ పోలీసులు శుక్ర‌వారం అత‌న్ని అరెస్ట్ చేశారు. నిందుతుడి నుండి 15 లక్షల రూపాయల నగదు, నకిలీ జాబ్ లెటర్స్, లాప్ టాప్, మొబైల్ ఫోన్ ను, విప్రో కంపెనీ కి చెందిన 70 ఫేక్ లెటర్ లను ఎస్ వో టీ మాదాపూర్ పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.

ఈ చీటింగ్ కేసు గురించి సీపీ సజ్జ‌నార్ మాట్లాడుతూ… మోసాల‌కు పాల్ప‌డిన చంద్ర‌శేఖ‌ర్ 2007- 09 మ‌ధ్య‌కాలంలో మహేంద్ర సత్యం , పలు ఎం.ఎన్.సి ల‌లో సాఫ్ట్ వేర్ గా పని చేశాడ‌ని చెప్పారు. మియాపూర్, కేపీహెచ్ బీ, చందా నగర్ లో నిందితుడు పై ఫిర్యాదులు ఉన్నాయ‌న్నారు.

ఎం ఎన్ సి నుండి జాబ్ కోసం డబ్బు చెల్లించమని ఎలాంటి కాల్స్ చేయరని సీపీ ఈ సంద‌ర్భంగా నిరుద్యోగుల‌కు సూచించారు. ఆగంతకులు కాల్స్ చేసి డబ్బులు అడిగితే మీరు మోస పోయినట్టేన‌ని , వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాల‌ని తెలిపారు.

Latest Updates