ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి.. పోలీసుల‌కు ట్యాగ్ చేసిన రిటైర్డ్ మేజ‌ర్

ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి, తిరిగి ఆ న్యూస్ నిజ‌మా అంటూ సైబరాబాద్ పోలీస్ అధికారిక ట్విట్టర్ కు ట్యాగ్ చేసిన వ్య‌క్తిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.
‘సైబరాబాద్ పోలీసులు నగరంలో నారింజ ప‌ళ్ల‌ అమ్మకాన్ని నిషేధించారు’ అని పేర్కొంటూ ఒక వార్తాపత్రిక క్లిప్పింగ్ ని మార్ఫ్ చేసి, ఆ ఫేక్ న్యూస్ కు కమిషనర్ సజ్జనార్ సహా పోలీసు అధికారులు ఉన్న ఫోటోను జ‌త చేసి ట్విట‌ర్ లో పోస్ట్ చేశాడు ఓ వ్య‌క్తి. ఆ ఫోటోలో కమిష‌న‌ర్ నారింజ పళ్ళను టేబుల్ మీద ఉంచి ప్రెస్ మీట్ ఇస్తున్నట్టుగా‌ ఉంది.

నారింజ పండ్లు రంగు ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్నందున నగరంలో ఆ పండ్ల‌ను ప్రదర్శనకు ఉంచడమ కానీ, అమ్మకం కానీ చేయకుండా సైబరాబాద్ పోలీసులు నిషేధించారు’ అని అతను పోస్ట్ చేశాడు. ఆ త‌ర్వాత తాను పోస్ట్ చేసిన న్యూస్‌ని.. ఏకంగా సైబరాబాద్ పోలీస్ అధికారిక ట్విటర్‌కు ట్యాగ్ చేసి, ఇది నిజమా? అని ప్రశ్నించాడు.

ఈ విష‌యాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఈ ఫేక్ న్యూస్ పై విచార‌ణ జ‌రిపి , సంచ‌ల‌న విష‌యాన్ని తెలిపారు. నీలం సింగ్ అనే ఓ రిటైర్డ్ మేజర్ ‘theskindoctor13 అనే నకిలీ ట్విటర్ అకౌంట్‌తో ఈ న్యూస్ క్రియేట్ చేసిన‌ట్టు తెలిపారు. అత‌న్ని అరెస్ట్ చేసి, అతని మీద క్రిమినల్ కేసు నమోదు చేసిన‌ట్టు వెల్ల‌డించారు.

Cyberabad Police mistakes spoof for fake news, books Twitter user

Latest Updates