సైబరాబాద్, రాచకొండలో లాక్ డౌన్ మరింత కఠినం

అదనపు బారికేడ్లతో పోలీసుల మోహరింపు
సెక్యూరిటీ అరేంజ్ మెంట్స్ కూడా పెంపు
హైదరాబాద్: లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేయడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా సైబరాబాద్ తోపాటు రాచకొండ కమిషనరేట్ ల్లో బుధవారం అదనంగా బారికేడ్లను ఏర్పాట్లు చేసి స్ట్రిక్ట్ గా చెకింగ్ చేశారు. అదనపు సెక్యూరిటీ అరేంజ్​ మెంట్స్ ను ఏర్పాటు చేయడంతోపాటు ఎక్స్ ట్రా బలగాలను ప్రతి జంక్షన్ దగ్గర ఉంచారు. సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్ పల్లి, మియాపూర్, జీడిమెట్ల, దుండిగల్, బాచుపల్లిల్లో సెక్యూరిటీ పెంచారు. రాచకొండ పరిధిలోని ఎల్ బీ నగర్, చైతన్యపురి, ఉప్పల్, మల్కాజ్ గిరి, నేరేడ్ మెట్, నాచారంల్లో పోలీసులు బారికేడ్లతో మోహరించారు. మంగళవారం ఒక్కరోజే రాచకొండ పరిధిలో 2,100 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

Latest Updates