హైదరాబాద్ లో ఏటీఎం కార్డ్స్ క్లోనింగ్ ముఠా అరెస్ట్

ఏటీఎం కార్డులు క్లోనింగ్ చేస్తున్న ఒడిశా ముఠాను అరెస్ట్ చేశారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. నగరంలోని పలు రెస్టారెంట్లు, పబ్బులలో ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. క్లోనింగ్ తో పాటు నకిలీ కార్డులను కూడా తయారు చేస్తుంది ఈ ముఠా. గచ్చిబౌలి హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో  పోలీసులు దర్యాప్తు చేయగా ఈ క్లోనింగ్ భాగోతం బయటపడింది. నిందితుల వద్ద రూ.10 లక్షల నగదుతో పాటు స్కిమర్, క్లోనింగ్ మిషన్, 44 క్లోనడ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇప్పటి వరకు 140 కార్డులను క్లోనింగ్ చేసి రూ.13 లక్షలు విత్ డ్రా చేశారు.

ఈ ముఠాలో ప్రధాన నిందితుడు ప్రఫుల్ కుమార్ టెన్త్ క్లాస్ వరకు చదివాడు. ఆపై లైన్ లో స్కిమర్, క్లోనింగ్ మిషన్ లను కొనుగోలుచేసి హై క్లాస్ రెస్టారెంట్లు, పబ్ లలో వెయిటర్ లుగా చేరుతారు. కస్టమర్ బిల్లులు చెల్లించేటప్పుడు తమ వెంట తెచ్చుకున్న స్కిమర్ సహాయంతో కార్డులోని డేటాను దొంగిలిస్తారు. పబ్ లలో, రెస్టారెంట్లల్లో పది రోజుల పాటే పనిచేసి మానేస్తారు.

see more news

కరోనా ఎఫెక్ట్.. ఉద్యోగులకు 2 వారాల జీతం బోనస్

జిమ్ లో ఆర్య వర్కవుట్స్ ..చూస్తే షాక్ అవాల్సిందే.!

కరోనాపై ఫైట్.. WHO ‘సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్’

 

Latest Updates