సైక్లింగ్​తో బ్రెస్ట్​ క్యాన్సర్​కు చెక్

సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే వారానికి ఒకట్రెండుసార్లు సైక్లింగ్​ చేస్తే బ్రెస్ట్​ క్యాన్సర్​ నుంచి బయటపడొచ్చని చెబుతున్నాయి తాజా రీసెర్చ్​లు. నిజానికి ప్రతిరోజూ వర్కవుట్స్​ చేయడం వల్ల ఎన్నో రోగాలు దూరమవుతాయి. అయితే ఒక్కో వర్కవుట్​తో ఒక్కో ప్రయోజనం ఉంటుంది.

సైక్లింగ్​తో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ బ్రెస్ట్​ క్యాన్సర్​తో బాధపడుతున్నవారు వారానికి కొంతసేపు సైక్లింగ్​ చేయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నాయి తాజా పరిశోధనలు.

అమెరికాలో ఆరువేల మంది బ్రెస్ట్​ క్యాన్సర్​ బాధితులపై పరిశోధన చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. వారానికి 150 నిమిషాలు సైక్లింగ్​ చేసినవారిలో 30 శాతం మందికి బ్రెస్ట్​ క్యాన్సర్​ పూర్తిగా తగ్గిపోయినట్లు గుర్తించారు. అంతేకాదు బ్రెస్ట్​ క్యాన్సర్​ లేనివారు సైక్లింగ్​ చేయడం వల్ల దాని బారిన పడకుండా ఉంటారని జర్మనీ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్​ సైంటిస్టులు తెలిపారు.  బ్రెస్ట్ క్యాన్సర్​కు, వ్యాయామానికి ఏమైనా సంబంధం ఉందా? అనే అంశంపై తొలిసారిగా స్టడీ చేసిన సైంటిస్టులు ఈ విషయాలను వెల్లడించారు.

Latest Updates