దూసుకొస్తున్న నివర్ తుపాను

నివర్  తుపాను తమిళనాడు తీరం వైపు దూసుకొస్తోంది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వాయువ్యదిశగా కదులుతోంది. ప్రస్తుతం తమిళనాడులోని కడలూరు కు 290 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. కొద్ది గంటల్లో పెనుతుపానుగా బలపడనుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ రోజు రాత్రికి కారైక్కాల్ , మామల్లపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపాను తీరం దాటుతుందని స్పష్టం చేసింది వాతావరణ శాక. దీని ప్రభావంతో ఇప్పటికే చెన్నై సహా తమిళనాడులోని కోస్తాజిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో 12 సెం.మీ వర్షం నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఏపీలోని కోస్తో జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. నెల్లూరు, చిత్తూరు తదితర ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి.

Latest Updates