అలర్ట్.. దక్షిణాదికి మరో తుఫాన్ హెచ్చరిక

నివర్ తుఫాన్ కలిగించిన నష్టం కోలుకోకముందే తమిళనాడుపైకి బురేవీ తుఫాన్ దూసుకొస్తోంది. బుధవారం  సాయంత్రానికి బురేవీ తుఫాన్ శ్రీలంకలోని ట్రింకోమలీ సిటీని దాటనుంది. రేపు(గురువారం) ఉదయం గల్ఫ్ ఆఫ్ మన్నార్ లోకి ప్రవేశించనున్న బురేవీ… ఈ నెల 4న దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారీ-పంబన్ మధ్య తీరం దాటే చాన్సుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బురేవీ ప్రభావంతో… దక్షిణ తమిళనాడులో ఇవాళ్టినుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD ప్రకటించింది. రేపట్నుంచి దక్షిణ కేరళలోనూ భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. తుఫాన్ కారణంగా ఇవాళ్టి నుంచి మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని IMD సూచించింది.

తుఫాన్ ను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాయి ప్రభుత్వాలు. కన్యాకుమారీ, తిరునల్వేలీ, అలెప్పీల్లో NDRF బృందాలను మోహరించారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని NDRF తెలిపింది.

Latest Updates