తెలంగాణపై వాయు తుఫాన్ ఎఫెక్ట్ : 3 రోజులు ఎండలు

దేశంలో ఇప్పటికే ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన నైరుతి రుతుపవనాలు… రాష్ట్రానికి మరింత ఆలస్యంగా రానున్నాయి. వాయు తుపాను కారణంగా.. గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో రుతుపవనాలు నిదానంగా కదులుతున్నాయి. ఈ నెల 13న వస్తాయనుకున్న రుతువపనాలు.. 15వరకు  వచ్చే ఛాన్స్ లేదని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది జూన్ 8 లోపే రుతుపవనాలు రాష్ట్రంలో పూర్తిగా విస్తరించాయని, కానీ, ఈ సారి పరిస్థితులు అనుకూలించడం లేదన్నారు.

ప్రస్తుతం అరేబియా సముద్రంలో తుఫాన్ కొనసాగుతుందన్నారు వాతావరణశాఖ అధికారులు. గాలిలో తేమ లేకపోవడంతో నైరుతి రుతుపవనాల కదలికలో ఆలస్యం అవుతుందన్నారు. మూడు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. దీని వల్ల ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు.  వడగాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు.

రుతుపవనాలు ఆలస్యంగా  వస్తుండటంతో ఈసారి జూన్ నెలలో….లోటు వర్షపాతం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అరేబియా సముద్రంలో తుఫాను వల్ల నైరుతి రుతుపవనాలు రాక మరింత ఆలస్యం అవుతుందంటున్నారు.రానున్న మూడ్రోజులు ఉత్తర, తూర్పు తెలంగాణల్లో కొన్ని చోట్ల వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు వాతావరణశాఖ అధికారులు.

Latest Updates