దిశ మార్చుకున్న వాయుగుండం.. తెలుగు రాష్ట్రాలకు తప్పిన వాన ముప్పు

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. గురువారం రాత్రి  వాయుగుండం దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్రల సమీపాన వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య ప్రాంతానికి ఆనుకుని కొనసాగుతోంది. అయితే ఇది దిశను మార్చుకుని పశ్చిమ బెంగాల్ – బంగ్లాదేశ్ వైపు పయనిస్తోందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలపడి బంగ్లాదేశ్ సమీపాన తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. వాయుగుండం దిశను మార్చుకోవడంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్షాల ముప్పు తప్పిందని అధికారులు చెప్పారు. రానున్న రెండ్రోజుల్లో తెలంగాణ, కోస్తాంధ్రల్లో అక్కడక్కడా మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు. రాయలసీమలో మాత్రం కొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతాయని తెలిపారు. ఉత్తర కోస్తా సముద్రతీరం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యాకారులు చేపల వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

 

Latest Updates