ఈడీ ఎదుట హాజరైన డీకే కుమార్తె ఐశ్వర్య

కర్నాటక మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డికె శివకుమార్ కుమార్తె ఐశ్వర్య ఇవాళ(గురువారం) ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) ఎదుట హాజరయ్యారు. మంగళవారం ఆమెకు ED సమన్లు జారీ చేసింది. బిజినెస్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్ అయిన ఐశ్వర్య కునిగల్ ఎమ్మెల్యే డాక్టర్ రంగనాథ్ వెంట రాగా గురువారం ఉదయం 10.50 గంటలకు న్యూఢిల్లీలోని ED కార్యాలయానికి చేరుకున్నారు. ఐశ్వర్య పేరుతో ఓ ట్రస్టు ఉంది. అందులో ఆమె సంపద 2013-18 కాలంలో భారీగా పెరగడంపై ప్రశ్నిస్తోంది ED. 2013లో ఆమె పేరుతో కేవలం రూ. 1.09 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నాయి. అయితే 2018 కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐశ్వర్యకు రూ.108 కోట్ల ఆస్తులు ఉన్నట్లు డికె శివకుమార్ ప్రకటించారు.

Latest Updates