డీమార్ట్ ఆన్ లైన్‌ సేల్స్ డబుల్

రూ.354 కోట్లు ఆన్ లైన్ అమ్మకాలు

నష్టాలు కూడా 57 శాతం జంప్

ముంబై : డీమార్ట్‌‌ రిటైల్ చెయిన్‌ ను ఆపరేట్ చేసే అవెన్యూ సూపర్‌ ‌మా ర్స్ట్ ఆన్‌ లైన్ సేల్స్ రెండింతలకు పైగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆన్‌ లైన్ సేల్స్ రూ.354 కోట్లకు పెరిగాయి. ఈ కంపెనీ కేవలం ముంబైలోనే డీమార్ట్ రెడీ పేరుతో ఆన్‌ లైన్ సేల్స్ బిజినెస్‌ ను నిర్వహిస్తోంది. ఆన్‌ లైన్ సేల్స్ పెరగడంతో పాటు, నష్టాలు కూడా అదేమాదిరి పెరిగాయి. కంపెనీ నష్టాలు 57 శాతం ఎగిసి రూ.80 కోట్లుగా ఉన్నాయి. నాలుగేళ్ల క్రితమే కంపెనీ ఈకామర్స్ సబ్సిడరీని ఏర్పాటు చేసింది. గతేడాది కూడా కంపెనీ ఆన్‌లైన్ బిజినెస్‌ లు రూ.144 కోట్ల సేల్స్‌‌ను, రూ 51 కోట్ల నష్టాలను రిపోర్ట్ చేసినట్టు అవెన్యూ సూపర్‌ ‌మా ర్స్ట్ యాన్యువల్ రిపోర్ట్‌‌లో వెల్లడైంది.

బిగ్‌‌బాస్కెట్, అమెజాన్, గ్రోఫర్స్ వంటి గ్రోసరీ డెలివరీ స్టార్టప్‌‌ల మాదిరిగా కాకుండా.. డీమార్ట్ ఆన్‌లైన్ వెంచర్‌‌‌‌ మల్టిపుల్  డెలివరీ సెంటర్లను లేదా పికప్ పాయింట్లను ఏర్పాటు చేసింది. కస్టమర్లు ఆన్‌లైన్‌ గా ఆర్డర్ చేసి, ఈ డెలివరీ సెంటర్లు లేదా పికప్‌‌ పాయింట్ల నుంచి ప్రొడక్ట్‌‌లను తీసుకుని వెళ్లొచ్చు. దేశ వ్యాప్తంగా 214కు పైగా స్టోర్లను ఆపరేట్ చేసే డీమార్ట్.. కరోనా మహమ్మారి కారణంగా, కొత్త స్టోర్ల లాంఛ్‌ ల స్ట్రాటజీని మార్చినట్టు చెప్పింది. ఈ మహమ్మారి దెబ్బకు స్టోర్ల మూసివేతను, తక్కువ కస్టమర్ల రాకను, డిమాండ్ పడిపోవడాన్ని ఎదుర్కొన్నట్టు ఆవేదన వ్యక్తం చేసింది.‘ఈ–కామర్స్ ఇండస్ట్రీ ఎప్పటికీ ఫోకస్ ఏరియాగా ఉంటోంది. కరోనాతో దీని ప్రాముఖ్యత ఇంకా పెరిగింది. ఈ రిటైల్‌‌లో ఆన్‌ లైన్ గ్రోసరీ ఇంకా తక్కువగానే ఉంది. కానీ గత కొన్ని నె లలుగా ఆన్‌ లైన్ గ్రోసరీ ఆకర్షణీయంగా మారింది. హౌస్‌ హోల్డ్ గ్రోసరీని, ఇతర ఐటమ్‌‌లను కన్జూమర్లు ఆన్‌ లైన్‌ గా ఆర్డర్ చేయడం పెరిగింది’ అని కంపెనీ తన యాన్యువల్ రిపోర్ట్‌‌లో తెలిపింది.

డీమార్ట్ స్టోర్లు ఒక్కో చదరపు అడుగుకు రూ.32,879 రెవెన్యూను జనరేట్ చేశాయి. ఇండియాలో ఇతర గ్రోసరీ స్టోర్లతో పోలిస్తే మూడింతలు ఎక్కువ రె వెన్యూలను ఇది పొందింది. నీల్సన్ రిపోర్టు  ప్రకారం,జూన్‌ తో ముగి సిన క్వా ర్టర్‌‌‌‌లో ఈ–కామర్స్ 16 శాతం గ్రోత్‌ తో వేగంగా పెరిగింది. కానీ ఏప్రిల్‌‌లో ప్రభుత్వం విధించి న కరోనా లాక్‌‌డౌన్, ఆ తర్వాత మూవ్‌ మెంట్ ఆంక్షలు, సప్లై చె యిన్లలో ఇబ్బందులు, లాస్ట్ మైల్ డెలివరీ వంటివి ఈ–కామర్స్‌‌కు అడ్డంకి గా మారాయి. మొత్తం ఫాస్ట్ మూవింగ్ కన్జూ మర్ గూడ్స్ కంపెనీల సేల్స్‌‌లో ఆన్‌ లైన్ ఛానల్స్ 3 శాతంగా ఉన్నాయి.

 

Latest Updates