దగ్గుబాటి అభిరామ్ కు కారు ప్రమాదంతో సంబంధం లేదు

రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని మ‌ణికొండ‌లో హీరో రానా తమ్ముడు, ద‌గ్గుబాటి అభిరామ్ కారు.. ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టిందని మీడియాలో వచ్చిన వార్తలను ఆయన కుటుంబసభ్యులు ఖండించారు. ఆ కారు ప్ర‌మాదానికీ, ద‌గ్గుబాటి అభిరామ్‌కూ అసలు ఎలాంటి సంబంధం లేదని వారు అన్నారు. ఆ ప్రమాదానికి కారణమైన కారు ద‌గ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన కారే కాదని వారు స్ప‌ష్టం చేశారు. ఈ ప్రమాద విష‌యంలో అభిరామ్ పై వస్తున్న వ‌దంతుల‌ను ద‌య‌చేసి న‌మ్మ‌వ‌ద్ద‌ని మరియు వాటిని ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని కోరారు. రానా హీరోగా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాకు అభిరామ్ నిర్మాతగా వ్యవహరించారు.

For More News..

నిన్న ఒక్కరోజే దేశంలో 67 వేల కరోనా కేసులు నమోదు

కొత్త ట్యాక్స్ స్కీం ప్రారంభించిన ప్రధాని మోడీ

ప్రణబ్ ముఖర్జీ బతికే ఉన్నారు

Latest Updates