జులై 25 నుంచి అయోధ్యపై సుప్రీంలో రోజువారీ విచారణ

జులై 18లోపు అయోధ్యపై నివేదిక కోరిన సుప్రీంకోర్టు

ఢిల్లీ : అయోధ్య మందిర్ – మసీద్ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో కీలక వాదనలు జరిగాయి. మధ్యవర్తిత్వంతో సమస్యకు పరిష్కారం కనిపించడం లేదని పిటిషనర్ గోపాల్ సింగ్ విశారద్ తరఫున సీనియర్ న్యాయవాది పరాశరణ అన్నారు. మధ్యవర్తిత్వ కమిటీ పరిష్కారం చూపలేదనడం సబబు కాదని మరో సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ అన్నారు. మధ్యవర్తిత్వ కమిటీ నచ్చని కొంతమంది ఇలా ఆరోపణలు చేస్తున్నారని రాజీవ్ ధావన్ కోర్టులో చెప్పారు.

ఐతే… జులై 25వ తేదీ నుంచి అయోధ్య వివాదంపై రోజువారీ విచారణ చేస్తామని రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. జూలై 18 లోపు అప్పటివరకు ఉన్న వాస్తవ నివేదిక ఇవ్వాలని మధ్యవర్తిత్వ కమిటీకి సుప్రీంకోర్టు సూచించింది. .

Latest Updates