వీరి క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతం: కాలిన‌డ‌క‌న‌ నిజామాబాద్ నుంచి ఒంగోలుకు

హైద‌రాబాద్: లాక్ డౌన్ తో రోడ్డున ప‌డ్డ ఎంతో మంది వ‌ల‌స కార్మికులు సొంతూరికి న‌డుచుకుంటూ వెళ్తున్న విష‌యం తెలిసిందే. అస‌లే ఎండాకాలం.. అందులోనూ చిన్న పిల్ల‌ల‌తో న‌డుచుకుంటూ పోతున్న వారి క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతం. మ‌న‌సున్న మారాజులు పెడుతున్న అన్నం తింటూ.. ఎక్క‌డ పొద్దు గ‌డిస్తే అక్క‌డే కునుకు తీస్తున్నారు. న‌డ‌వ‌లేక అల‌సిపోయిన‌ప్పుడు కాసేపు స్కూల్స్ , చెట్ల కింద ఆగుతున్నారు. మ‌ళ్లీ గ‌మ్యం గుర్తుకు రాగానే నెత్తిన మూట‌లు పెట్టుకుని ఎంతో క‌ష్టం న‌డ‌వ‌సాగుతున్నారు. చిన్న పిల్ల‌లైతే మోకాల్లు ప‌ట్టుకుంటూ బ‌ల‌వంతంగా న‌డుస్తున్నారు.

నిజామాబాద్ నుంచి ఒంగోలుకు

ఓ వ‌ల‌స కార్మిక‌ కుటుంబం నాలుగు రోజుల కింద నిజామాబాద్ నుంచి కాలిన‌డ‌క‌న ఒంగోలుకు బ‌య‌లు దేరింది. శుక్ర‌వారం హైద‌రాబాద్ కు చేరుకున్నారు. ఈ కుటుంబంలో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. నిజమాబాబాద్ నుంచి 4 రోజులుగా నడుచుకుంటూ హైదరాబాద్ కు చేరుకున్నారు. కాసేపు చెట్ల కింద కూర్చున్న ఈ ఫ్యామిలీ మ‌ళ్లీ న‌డ‌వ సాగింది. ఓ వ్య‌క్తికి చెప్పులు కూడా లేవు. చిన్న పిల్ల‌ల‌తో ఒంగోలుకు ఎప్పుడు చేరుతారో పాపం.

 

Latest Updates