భూమాత మన బాధ్యతలను గుర్తు చేస్తోంది: దలైలామా

ధర్మశాల: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ తమ బాధ్యతలను గుర్తు చేస్తూ భూమాత పాఠం నేర్పుతోందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. స్థిరమైన అభివృద్ధి అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. 50వ యానివర్సరీ ఎర్త్ డే సందర్భంగా దలైలామా పలు విషయాల గురించి మాట్లాడారు. ప్రజల ఆరోగ్యం, జీవనానికి సంబంధించి భూ గ్రహం అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. ఈ పోరాటంలో కరుణ, పరస్పర మద్దతు కావాలన్నారు. ‘కరోనా మహమ్మారి అందరిపై ఒకేరీతిన ప్రభావం చూపుతోంది. జాతి, సంస్కృతి, జెండర్ డిఫెరెన్స్ అనేది లేకుండా అందరిపై ఒకేలా విరుచుకుపడుతోంది. ఈ టైమ్ లో మానవత్వం నిండిన మనుషులుగా అందరికీ అవసరమైనవి అందించడమే మన కర్తవ్యం. అందరూ సమానమనే భావన కలిగినప్పుడు.. మిగిలిన వారిపై సానుభూతి, క్లోజ్ నెస్ కలుగుతాయి. ఇది మనందరి యూనివర్సల్ రెస్పాన్సిబులిటీ. మిగతావాళ్లు తమ సమస్యలను అధిగమించేలా మనం వారికి తోడ్పాటును అందించాలి. ఇదే విషయాన్ని భూమాత మనకు నేర్పిస్తోంది. భూమి మనుగడే మన మనుగడ. భూమి భవిష్యతే మన భవిష్యత్. ఒక విధంగా భూమి మనకు తల్లి లాంటిది. ఆమె బిడ్డలమైన మనం భూమాతపైనే ఆధారపడ్డాం. గ్లోబల్ సమస్యలపై కచ్చితంగా అందరం కలసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంది. నేడు ప్రపంచవ్యాప్తంగా పరిశుభ్రమైన తాగునీరు దొరకడమనేది పెద్ద సమస్యగా మారింది. డ్రింకింగ్ వాటర్ తోపాటు శానిటైజేషన్ లాంటి ప్రాథమిక అవసరాలపై హెల్త్ కేర్ ప్రొవైడర్స్ దృష్టి పెట్టాలి. సరైన ఎక్విప్డ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉంటే కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కోవడానికి సాయపడుతుంది. త్వరలోనే సంతోషకరమైన, ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని చూడాలని ప్రార్థిస్తున్నాను’ అని దలైలామా పేర్కొన్నారు.

Latest Updates