అర్ధ‌రాత్రి వేళ ద‌ళితుడి ఇంటిపై దుండగుల‌‌ రాళ్ల దాడి

మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్జాల్ గుడా లో ఉన్న ఓ ఇంటిపై బుధ‌వారం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రాళ్ల‌తో దాడి చేశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్ఢ్ అయ్యాయి. అయితే తాము దళితులమనే త‌మ‌ ఇంటిపై దాడి చేశార‌ని ఇంటి య‌జ‌మాని సునీల్ దత్ కాంబ్లే అన్నారు. దాడిలో ఇంటి ముఖద్వారం, బయట ఉన్న వాహనాల అద్దాలను ధ్వంసం చేశార‌ని చెప్పారు.

జరిగిన సంఘటన మొత్తం సి.సి టీవీల్లో రికార్డ్ అవ్వ‌డంతో బాధితుడు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై దర్యాప్తు చేస్తున్నారు. దాడికి స్థ‌ల వివాద‌మే కార‌ణ‌మ‌ని స్థానికులు చెబుతున్నారు. జరిగిన దాడిని ఖండిస్తూ నిందితులని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘ నాయకులు బాధితుడికి అండగా నిలిచారు.

Dalit man's house was attacked with stones by thugs in the middle of the night in mirjalguda

Latest Updates