అమ్మాయితో మాట్లాడాడని యువకుడికి గుండు కొట్టించి..!

రాజస్థాన్ జోధ్ పూర్ లో దారుణం జరిగింది. ఓ యువకుడు అమ్మాయితో మాట్లాడాడంటూ దారుణంగా కొట్టి గుండు కొట్టించారు. జోద్ పూర్ లోని బల్దేవ్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న రాహుల్ (20) వెహికిల్ మెకానిక్ గా జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఓ థియేటర్ సమీపంలో ఉన్న ఓ కేఫ్‌లో రాహుల్ ఓ యువతితో మాట్లాడుతున్నాడు. రాహుల్, యువతి మాట్లాడుకోవడంపై  అమ్మాయి తరుపు బంధువులు చూశారు. అంతే దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు, కుటుంబసభ్యులు ఆ యువకుడిపై రాడ్డుతో దాడి చేశారు. దాడిలో బాధితుడికి తీవ్రగాయాలయ్యాయి. అంతేకాదు అమ్మాయితో మాట్లాడతావా అంటూ గుండు కొట్టించారు. ఈ దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా నిందితులు యువతి సోదరిడితో రాహుల్ వాగ్వాదానికి దిగాడని, అందుకే అతన్ని కొట్టినట్లు నిందితులు చెప్పారంటూ  ప్రముఖ మీడియా సంస్థ “ది ప్రింట్” కథనాన్ని ప్రచురించింది.

Latest Updates