కరోనాతో సాగుకూ సెగ..పడిపోతున్నధరలు

  • పడిపోతున్న ధరలు
  • తగ్గుతున్న రూరల్ డిమాండ్‌
  • నిలిచిపోయిన ఎగుమతులు
  • విదేశాల నుంచి ఆర్డర్లు బంద్‌‌
  • బియ్యం వ్యాపారులకు విపరీతంగా నష్టాలు

న్యూఢిల్లీఇంట్లోకంటే పంట చేనులోనే ఎక్కువ సేపు ఉండే రైతు భరద్వాజ్‌‌‌‌ ఈసారి చలికాలపు పంట చేతికి రాగానే కారు కొందామనుకున్నారు.  దిగుబడి బాగానే వచ్చే అవకాశం ఉంది కాబట్టి కారు స్టీరింగ్‌‌‌‌ తన చేతిలోకి రావడం గ్యారంటీ అని ఆయన ఆశపడ్డారు. అయితే భరద్వాజ్‌‌‌‌ కారు కల నిజమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే వ్యవసాయ రంగానికి కూడా కరోనా సెగ తగులుతోంది. ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య పంటల ధరల దారుణంగా పడిపోయాయి. ఇప్పటి ధరల ప్రకారం పంటను అమ్మితే వచ్చిన డబ్బు బాకీలు తీర్చడానికి సరిపోతుందని బాధగా చెప్పారాయన. రాజస్థాన్‌‌‌‌కు చెందిన ఈ రైతన్న ఆరు హెక్టార్లలో ఆవాలు, శెనగలు సాగు చేశారు. ఆవాల ధరలు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 16 శాతం, శెనగల ధరలు 10 శాతం తగ్గాయి. ధరలు మరింత తగ్గితే కనీసం బాకీలు తీర్చడం కూడా తన వల్ల కాదని భరద్వాజ్‌‌‌‌ అంటున్నారు. కేవలం రాజస్థాన్‌‌‌‌లోనే కాదు అన్ని రాష్ట్రాల్లోనూ వాణిజ్య పంటల ధరలు పడిపోతున్నాయి. దీంతో రైతులకు దిక్కుతోచడం లేదు.

సగం మందికి సాగే దిక్కు..

మనదేశంలో దాదాపు 26.3 కోట్ల మంది రైతులు ఉంటారు. దేశ జనాభా 130 కోట్లలో సగం మంది సాగురంగంపై ఆధారపడి జీవిస్తారు. అందుకే వ్యవసాయరంగం మనదేశ ఎకానమీకి చాలా ముఖ్యం. పంట దిగుబడులు బాగుండి, తగిన మద్దతు ధరలు దొరికితే జీడీపీకి ఎంతో మేలు. లేకపోతే ఎకానమీ నెమ్మదిస్తుంది. గతేడాది అధిక వర్షాలు పంటలను నాశనం చేశాయి. ఎక్కువ మంది రైతులు చలికాలపు పంటలపైనే ఆధారపడతారు. వీటివల్లే గ్రామాల్లో డిమాండ్‌‌‌‌ పెరుగుతుంది. అయితే కరోనా రెచ్చిపోతుండటంతో ఆసియాలోనే మూడో అతిపెద్ద ఎకానమీ అయిన ఇండియాలో వాణిజ్య పంటల ధరలు పడిపోతున్నాయి. మరోవైపు జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి తగ్గింది.

వేటి ధరలు తగ్గాయంటే…

ఆవాలు, శెనగలతోపాటు మొక్కజొన్న, సోయాబీన్స్‌‌‌‌, పత్తి, ఉల్లిపాయ ధరలు 50 శాతం తగ్గాయి. పంటలు చేతికొస్తున్న సమయంలోనే ఇలా జరిగింది. దిగుబడులు ఎక్కువ వచ్చినా ధరలు తగ్గడం వల్ల లాభాలేమీ ఉండవని ముంబైలోని ఇండియాట్రేడ్‌‌‌‌ డెరివేటివ్స్ అండ్‌‌‌‌ కమోడిటీస్‌‌‌‌.. హెడ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ది కమోడిటీస్‌‌‌‌ గాలిపెల్లి హరీశ్‌‌‌‌ చెప్పారు. చాలా రాష్ట్రాల్లో గత జూన్‌‌‌‌–సెప్టెంబర్‌‌‌‌లో మంచి వర్షాలు పడ్డాయి. దీనివల్ల భూసారం, రిజర్వాయర్ల లెవెల్స్‌‌‌‌ పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే సాగువిస్తీర్ణం పది శాతం పెరిగి 662 కోట్ల హెక్టార్లకు పెరిగింది. విత్తనాలకు, ఎరువులకు కూడా బాగా ఖర్చు చేశారు. పౌల్ట్రీ ధరలు తగ్గడం వల్ల సోయాబీన్‌‌‌‌ ధరలు 22 శాతం తగ్గాయని మరో రైతు చెప్పారు. చికెన్‌‌‌‌ తింటే కరోనా వస్తుందని పుకార్లు రావడంతో దీనికి డిమాండ్‌‌‌‌ పూర్తిగా తగ్గింది. కొన్ని చోట్ల ఉచితంగా చికెన్‌‌‌‌ ఇచ్చే పరిస్థితి ఏర్పడింది.

నష్టాలు ఎందుకంటే

  • కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా బియ్యం,
  • మొక్కజొన్న, సోయా, ఆవాలు, పత్తి వంటి
  • అగ్రికమోడిటీస్ ధరలు బాగా పడిపోయాయి. ఫలితంగా ఇండియా నుంచి ఎగుమతులు తగ్గాయి. అరటిపళ్ల వంటి వాటి ధరలూ
  • తగ్గాయని ఆంధ్రప్రదేశ్‌‌ రైతులు తెలిపారు.
  • సౌతిండియా నుంచి నాన్‌‌–బాస్మతి బియ్యం ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈసారి తమ వ్యాపారాలు నిండా మునగడం ఖాయమని ట్రేడర్లు చెబుతున్నారు. గత 15 రోజులుగా కొత్త ఆర్డర్లు అసలు రావడం లేదని చెబుతున్నారు.

ఎగుమతులూ లేవు

సాధారణంగా ఎండాకాలపు పంటలకు ఫిబ్రవరిలో ధరలు పెరుగుతాయి. ఎందుకంటే అప్పటి వరకు ఎగుమతులు పెరిగి సరఫరాలు తగ్గుతాయి. ఈసారి ఎగుమతులు బాగా తగ్గడంతో ధరలు పెరగలేదు. ప్రపంచవ్యాప్తంగా అగ్రికమోడిటీస్‌‌ ధరలు తగ్గడంతో ఇండియా నుంచి కొనుగోళ్లను చాలా దేశాలు ఆపేశాయి. గత రెండు వారాలుగా కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షాలు పంటలను నాశనం చేశాయి. గడచిన 15 రోజుల నుంచి విదేశాల నుంచి కొత్తగా ఒక్క ఆర్డర్‌‌ కూడా రావడం లేదని ఎక్స్‌‌పోర్టర్లు చెబుతున్నారు.

Latest Updates