కరోనా ఫండ్‌ పేరుతో హెచ్‌సీఏ ఖజానాకు గండి

  • క్లబ్‌ సెక్రటరీల నుంచి బ్యాంక్‌‌ అకౌంట్‌‌ వివరాలు సేకరణ
  •  అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అసోసియేషన్ మెంబర్లు
  •  బీసీసీఐకి లెటర్

ఒకవైపు కరోనా దెబ్బకు ప్రపంచం స్తంభించిపోయింది. స్పోర్ట్స్ తో పాటు అనేక రంగాలు దెబ్బతిన్నాయి. ఈ టైమ్‌‌‌‌లో చాలా మంది డొనేషన్లు ఇస్తూ కష్టాల్లో ఉన్నవారికి హెల్ప్‌‌‌‌ చేస్తున్నారు. స్పోర్ట్స్ పర్సన్లు , స్పోర్స్ ట్ అసోసియేషన్లు ప్రభు త్వానికి విరాళాలు ఇస్తున్నారు. కానీ, ఎప్పుడూ అవినీతి ఆరోపణల్లో మునిగితేలే హైదరాబాద్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ అసోసియేషన్ (హెచ్‌‌‌‌సీఏ) మాత్రం తమ అనుబంధ క్లబ్స్ ‌‌‌కు పైసలు పంచి పెట్టేందుకు కరోనా పేరును కూడా వాడుకుంటోందన్న విమ ర్శలు వస్తున్నాయి. ‘కరోనా ఫండ్‌‌‌‌’ పేరుతో ఒక్కో క్లబ్‌‌‌‌కు రూ. 50 వేలు ఇవ్వాలని ఎపెక్స్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ నిర్ణయించడం వివాదాస్పదమైంది. ఈ మేరకు హెచ్‌‌‌‌సీఏ సెక్రటరీ ఆర్‌‌‌‌. విజయానంద్‌‌‌‌ .. క్లబ్స్ కు మెసేజ్‌‌‌‌ ఇచ్చారు. ఆయా కబ్స్ ‌‌‌ బ్యాంక్‌‌‌‌ అకౌంట్‌‌‌‌ వివరాలు ఇవ్వాలని కోరారు. హెచ్‌‌‌‌సీఏ ఫౌండేషన్‌‌‌‌డేను పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీన క్లబ్స్ ‌‌‌కు ఈ ఫండ్‌‌‌‌ ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్‌‌‌‌ మినహా అన్ని ప్రైవేట్‌ క్లబ్స్ కు ఫండ్ ఇస్తామన్నారు. ఆడిటర్‌‌‌‌ అప్రూవల్‌‌‌‌ ఇస్తే జిల్లా అసోసియేషన్లకు కూడా ఈ మొత్తం కే టాయిస్తామన్నారు. దీనివల్ల హెచ్‌‌‌‌సీఏ ఖజానాపై దాదాపు కోటి రూపాయల భారం పడనుంది. అయితే, ఈ  నిర్ణయం పై హెచ్‌‌‌‌సీఏ సభ్యులు, క్లబ్‌‌‌‌ సెక్రటరీల నుంచే వ్యతిరేకత వస్తోంది. ఈ రకంగా డబ్బు పంచాలనుకోవడం సరికాదని అంటున్నారు. లాక్‌ ‌‌‌డౌన్‌‌‌‌ వల్ల కబ్స్ ‌ గానీ, సెక్రటరీలు గానీ నష్టపోయేది ఏమీ లేదని, అలాంటప్పుడు వారికి ఫండ్‌‌‌‌ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి గ్రాంట్‌‌‌‌ ఇవ్వాలని అసోసియేషన్‌‌‌‌ కాన్‌‌‌‌స్టిట్యూషన్‌‌‌‌లో లేదన్నారు. ఒకవేళ క్లబ్స్ కు  చేయూత అందించాలని అనుకుంటే దీని పేరును ‘క్లబ్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ ఫండ్‌‌‌‌’ అని మార్చాలని సూచించారు. హెచ్‌‌‌‌సీఏ నుంచి వచ్చే డబ్బును క్లబ్స్ కోసమే వాడాలని, అంతే తప్ప క్లబ్‌‌‌‌ సెక్రటరీలకు వ్యక్తిగత లాభం చేకూర్చకూడదని స్పష్టం చేస్తూహెచ్‌‌‌‌సీఏ సె క్రటరీతో పాటు బీసీసీఐ ప్రెసిడెంట్‌‌‌‌, సెక్రటరీ, ట్రెజరర్‌‌‌‌కు లేఖ రాశారు. అలాగే, హెచ్‌‌‌‌సీఏకు రిలీజ్‌‌‌‌ చేసిన నిధులను ‘కరోనా ఫండ్‌‌‌‌ ’ పేరుతో క్లబ్‌‌‌‌ సెక్రటరీలకు పంచేందుకు అనుమతించారో లేదో స్పష్టత ఇవ్వాలని బీసీసీఐని కోరారు. ఇక, క్లబ్‌‌‌‌ సెక్రటరీలకు డబ్బులు ఇవ్వడం అవసరమా? అని హెచ్‌‌‌‌సీఏ మాజీ వైస్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ ప్రకాశ్‌ చంద్‌‌‌‌ జైన్‌‌‌‌ ప్రశ్నించారు. ‘ఈ టైమ్‌‌‌‌లోఆర్థిక ర్థి ఇబ్బందులు ఎదుర్కొంటున్న హెచ్‌‌‌‌సీఏ స్టాఫ్‌‌‌‌ మెంబర్స్‌‌‌‌కు డబ్బులు ఇస్తే వాళను ఆదుకున్నట్లు ఉంటుంది. లేదంటే పేద ప్రజలకు గానీ, సీఎం రిలీఫ్‌‌‌‌ ఫండ్‌‌‌‌కు గానీ సాయం చేయాలి. అవసరమైతే ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ డెవలప్‌‌‌‌ చేసుకునేందుకు వాడాలి. అంతేగాని క్ల బ్స్‌‌‌‌కు ఇవ్వాలనుకోవడం అంటే బీసీసీఐ ఫండ్స్‌‌‌‌ను పూర్తిగా దుర్వినియోగం చేయడమే అవుతుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

వాళ్ల జేబుల్లోకే పైసలు

హెచ్‌‌‌‌సీఏ జనరల్‌‌‌‌ బాడీ మీటింగ్‌‌‌‌ కు ముందు క్లబ్‌‌‌‌ సెక్రటరీలను మచ్చిక చేసుకోవడం కోసమే ‘కరోనా ఫండ్‌‌‌‌ ’ను తెరపైకి తెచ్చారని ఓ క్లబ్‌‌‌‌ సెక్రటరీ విమర్శించారు. ఈ ఫండ్‌‌‌‌ తో ఇచ్చే డబ్బు కూడా మల్టిపుల్‌‌ క్లబ్స్ ఉన్న పెద్దల జేబుల్లోకే వె ళ్తుందని చెప్పారు. ఇక, ఈ ఫండ్‌‌‌‌ గురించి జిల్లా అసోసియేషన్లకు సమాచారం రాలేదని ఓ జిల్లా సెక్రటరీ చెప్పారు. ఒకవేళ జిల్లాలకు కూడా డబ్బు ఇవ్వాలన్ని నిర్ణయించానా తాము మాత్రం తీసుకోమని స్పష్టం చేశారు.

Latest Updates