లాక్ డౌన్ తో లక్షల ఆర్డర్లు క్యాన్సిల్..ఆన్ లైన్ బిజినెస్ కు దెబ్బ

బెంగళూరు:  జనతా కర్ఫ్యూ వలన కొన్ని లక్షల ఆర్డర్లను రద్దు లేదా రీ షెడ్యూల్‌‌‌‌ చేయాల్సి వచ్చిందని ఈ–కామర్స్‌‌‌‌ సంస్థలు వాపోతున్నాయి. అత్యవసరమైన మెడిసిన్స్‌‌‌‌, ఫుడ్, గ్రోసరీల సరఫరాను లోకల్‌‌‌‌ అధికారులు బలవంతగా అడ్డుకున్నారని ఈ–కామర్స్‌‌‌‌ సంస్థలు బిగ్‌‌‌‌బాస్కెట్‌‌‌‌, గ్రోఫర్స్‌‌‌‌, 1 ఎంజీ ఆరోపించాయి. తమ వేర్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌లను మూసివేశారని, సప్లై ట్రక్కులను ఆపేశారని,  డెలివరీ ఏజెంట్‌‌‌‌లను వీధుల్లోకి రాకుండా అడ్డుకున్నారని తెలిపాయి.  గత వారం ఈ-కామర్స్‌‌‌‌ సంస్థల వేర్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌లు, లాజిస్టిక్‌‌‌‌ ఫెసిలిటీలు, డెలివరీ పార్టనర్లను ప్రొబిషనరీ ఆర్డర్స్‌‌‌‌ నుంచి ప్రభుత్వం మినహాయించింది. అత్యవసరమైన వస్తువుల సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.  అయినప్పటికి లోకల్‌‌‌‌ అధికారులు తమ సరఫరాలను అడ్డుకున్నారని ఈ కామర్స్‌‌‌‌ సంస్థలు వాపోతున్నాయి.  కాగా కర్ఫ్యూ వలన అమెజాన్‌‌‌‌, ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌ వంటి ఈ–కామర్స్‌‌‌‌ సంస్థలతో పాటు, బిగ్‌‌‌‌బాస్కెట్‌‌‌‌, గ్రోఫర్స్‌‌‌‌, 1 ఎంజీ వంటి కంపెనీ సరఫరాలు కూడా ఆగిపోయాయి.వేటిని అనుమతించాలో సెంట్రల్‌‌‌‌ గవర్నెమెంట్‌‌‌‌ నుంచి  లోకల్‌‌‌‌ అధికారులకు స్పష్టమైన మెసేజ్‌‌‌‌ లేదని గ్రోఫర్స్‌‌‌‌ సీఈఓ అల్బిందర్‌‌‌‌‌‌‌‌ ధిండ్సా అన్నారు. అత్యవసరమైన వస్తువులను డెలివరీ చేసే కంపెనీలకు అనుమతివ్వాలన్నారు. ప్రజలు సెల్ఫ్‌‌‌‌ క్వారంటైన్‌‌‌‌ అవ్వడానికి ఇది సాయపడుతుందని తెలిపారు గ్రోఫర్స్‌‌‌‌ ఆదివారం ఏకంగా 1,70,000 ఆర్డర్లను క్యాన్సల్‌‌‌‌ లేదా రీషెడ్యూల్‌‌‌‌ చేసింది. తమ వేర్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌లకు సప్లై చేసే ట్రక్కులను తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌‌‌‌, మహారాష్ట్ర, కర్నాటకలలో ఆపేశారని ధిండ్సా అన్నారు. వీటితో పాటు మహారాష్ట్ర , హర్యానాలలో కంపెనీ వేర్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌లను బలవంతంగా మూసేశారని అన్నారు. దాదాపు అన్ని నగరాలలో తమ డెలివరీ ఏజెంట్లను ఆపారని, కొంత మందిని కొట్టారని కూడా బిగ్‌‌‌‌బాస్కెట్‌‌‌‌ ఆరోపించింది. ఈ విషయాలకు సంబంధించి ఈ–కామర్స్‌‌‌‌ కంపెనీల నుంచి ఫిర్యాదులు వచ్చాయని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. స్టేట్‌‌‌‌ లెవెల్‌‌‌‌లో సెక్రటరీలతో  చర్చిస్తున్నామని, తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఆర్డర్లు అమాంతం పెరిగాయి..

మందులను డెలివరీ చేసే 1 ఎంజీ కూడా ఆదివారం ఇబ్బందులు పడింది. ఇళ్ల వద్ద నుంచి శాంపెల్స్‌‌‌‌ను కలెక్ట్‌‌‌‌ చేసి, ఈ సంస్థ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ డయోగ్నస్టిక్స్‌‌‌‌ను అందిస్తోంది. ఢిల్లీ, పాట్నా, ముంబైలలో తమ ప్రి ఎనలిటికల్‌‌‌‌ సెంటర్లను మూసేశారని 1 ఎంజీ తెలిపింది. హైదరాబాద్‌‌‌‌, ఢిల్లీలో, లక్నో, ఫరీదాబాద్‌‌‌‌, గూర్గావ్‌‌‌‌లో తమ డెలివరీ ఏజెంట్లను అడ్డుకున్నారంది. లోకల్‌‌‌‌ అధికారులకు స్పష్టత లేదని 1 ఎంజీ సీఈఓ ప్రశాంత్‌‌‌‌ టాండాన్‌‌‌‌ అన్నారు. కర్ఫ్యూ సమయాలలో  అత్యవసరమైన వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం ఉండకూడదని తెలిపారు. గ్రోసరీ డెలివరీ కంపెనీలకు ఆర్డర్లు విపరీతంగా వచ్చాయని కంపెనీల ఎగ్జిక్యూటివ్‌‌‌‌లు తెలిపారు. కర్య్ఫూ వలన ఒక్క ఆదివారమే ఐదు రెట్లు ఎక్కువగా ఆర్డర్లు వచ్చాయన్నారు.  యావరేజ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ వాల్యు కూడా 20–25 శాతం పెరిగిందని తెలిపారు. చాలా రాష్ట్రాలు లాక్‌‌‌‌ డౌన్‌‌‌‌లో ఉండడంతో వీటికి డిమాండ్‌‌‌‌ మరింత పెరుగుతుందని అన్నారు.

Latest Updates