డీమార్ట్‌‌లో దమానీ వాటాల అమ్మకం

5.2 శాతం వాటాలు అమ్మేందుకు ప్లాన్

ఈ డీల్ విలువ రూ.5,807 కోట్లు

ముంబై : డీమార్ట్‌‌‌‌ పేరుతో రిటైల్‌‌‌‌ స్టోర్లను నిర్వహించే అవెన్యూ సూపర్‌‌‌‌‌‌‌‌మార్ట్స్ లిమిటెడ్‌‌‌‌లో మరో రౌండ్‌‌‌‌ వాటాల అమ్మకం చేపడుతున్నారు దీని ప్రమోటర్‌‌‌‌ రాధాకృష్ణ దమానీ. దీని కోసం బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్ప్, కొటక్ మహింద్రా క్యాపిటల్‌‌‌‌లను రాధాకృష్ణ దమానీ ఎంపిక చేశారు. ఇండియాలోనే అతిపెద్ద లిస్టెడ్ రిటైల్‌‌‌‌ చెయిన్‌‌‌‌ అయిన డీమార్ట్‌‌‌‌లో వచ్చే ఏడాది 5.2 శాతం వాటాలను అమ్మేందుకు దమానీ సిద్ధమయ్యారని సంబంధిత వ్యక్తులు చెప్పారు.  ఈ డిస్కషన్స్‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌గా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా దమానీ 1 శాతం వాటాలను అమ్మారు. కంపెనీలో మినిమమ్ పబ్లిక్‌‌‌‌ షేర్‌‌‌‌‌‌‌‌హోల్డింగ్ నిబంధనను మీట్ కావడం కోసం మార్చి కల్లా మరిన్ని షేర్లను అమ్మాలని దమానీ నిర్ణయించారని మరో వ్యక్తి చెప్పారు.

అవెన్యూ సూపర్‌‌‌‌‌‌‌‌ మార్ట్స్‌‌‌‌లో 5.2 శాతం వాటాల విలువ.. శుక్రవారం షేరు ముగింపు ధర ప్రకారం రూ.5,807 కోట్లు. అవెన్యూ సూపర్‌‌‌‌‌‌‌‌మార్ట్స్‌‌‌‌లో ఫౌండర్స్‌‌‌‌కు 80.2 శాతం వాటా ఉంది. దీనిలో దమానీకి 37.4 శాతం షేరు ఉంది. తాజా రూల్స్ ప్రకారం కంపెనీల్లో మినిమమ్ పబ్లిక్‌‌‌‌ షేర్‌‌‌‌‌‌‌‌హోల్డింగ్ 25 శాతం ఉండాలి. ఆసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇండియాలో గత కొంత కాలంగా ఎఫ్‌‌‌‌ఎంసీజీ రంగానికి డిమాండ్‌‌‌‌ పడిపోయింది. ఈ సమయంలో దమానీ షేర్ సేల్‌‌‌‌ చేపడుతున్నారు. డీమార్ట్‌‌‌‌ బ్రాండ్ కింద ఫుడ్ అండ్ గ్రోసరీ రిటైల్ స్టోర్లను అవెన్యూ సూపర్ మార్ట్స్‌‌‌‌ ఆపరేట్ చేస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి అవెన్యూ సూపర్‌‌‌‌‌‌‌‌మార్ట్స్ షేర్లు 12 శాతం లాభపడ్డాయి. అయితే ఈ డీల్‌‌‌‌పై దమానీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. బ్యాంక్ ఆఫ్ అమెరికా, అవెన్యూ సూపర్‌‌‌‌‌‌‌‌మార్ట్స్ ప్రతినిధులు దీనిపై స్పందించడానికి నిరాకరించారు.

Latest Updates