డీజే పాటలకు..దాండియా జోష్‌‌

  • దసరా సందర్భంగా ఈవెంట్లలో సందడి
  • ఈవెనింగ్ నుంచి కార్యక్రమాలు షురూ
  • లైవ్ ఆర్కెస్ట్రా తో పాటు నార్త్, సౌత్ ఫుడ్ స్టాల్స్

హైదరాబాద్, వెలుగు: డీజే సాంగ్స్​కి దాండియా స్టెప్పులు.. కోలాటాల చప్పుళ్లు.. డిస్కో లైట్ల వెలుగుల్లో ఆటలు.. ఇదే డిస్కో దాండియా. డీజేకు, దాండియా మిక్స్ చేసి ఇప్పుడు సిటీలో డిస్కో దాండియా ఈవెంట్లు జోరుగా సాగుతున్నాయి. దసరా సందర్భంగా యూత్‌‌, ఫ్యామిలీ స్టెప్పులేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

డీజే స్పెషల్‌‌ అట్రాక్షన్..

పండుగ సంబురాలను యూత్‌‌ ఎక్కువగా ఈవెంట్స్ లోనే సెలబ్రేట్ చేసుకుంటారు. ఈవెంట్ ఆర్గనైజర్లు అట్రాక్ట్ చేసేందుకు ఫేమస్ సెలబ్రిటీలను, లైవ్ మ్యూజిక్ లను ఏర్పాటు చేసి ఈవెంట్స్ కండక్ట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని రోజుల ముందే టికెట్లను ఆన్‌‌లైన్‌‌లో అందుబాటులో ఉంచారు. ఈవెంట్స్‌‌ లో పార్టిసిపేట్ చేయాలనుకునే వారికి బుక్ మై షో, పేటీఎం, దాండియా ఈవెంట్ సైట్స్ లో టికెట్స్ బుక్‌‌ చేసుకోవచ్చు. వందల్లో ఎంట్రీ ఫీజులు ఉన్నాయి. ఈసారి సిటిజన్స్ ని అట్రాక్ట్ చేసేందుకు డిఫరెంట్ దాండియా ఈవెంట్స్ ని కండక్ట్ చేస్తున్నారు ఈవెంట్ ఆర్గనైజర్లు. అందులో డిస్కో దాండియా సమ్‌‌థింగ్ స్పెషల్. సంప్రదాయ దాండియా నృత్యానికి, మోడ్రన్ డీజే ని జోడించి నిర్వహిస్తోన్న ఈ డిస్కో దాండియాకు ఎంతో  క్రేజ్ ఉంది.ఈవెనింగ్​ నుంచి దాండియా కార్యక్రమాలు షురూ అవుతాయి.

టేస్టీ రెసిపీలు

ఈవెంట్స్ లో లైవ్ మ్యూజిక్, సౌత్‌‌, నార్త్ ఇండియన్ రెసీపీలతో ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. డిస్కో దాండియాలో బాలీవుడ్ దాండియా సాంగ్స్, తెలుగు దాండియా సాంగ్స్ ప్లే చేస్తారు. ఇందులో పాల్గొనేవారు దాండియా కాస్ట్యూమ్స్ తో పాటు స్టిక్స్ కూడా తమ వెంట తీసుకెళ్లాలి. సిటీలోని పలుప్రాంతాల్లో డిస్కో దాండియా జోరు సాగుతోంది.

దాండియాలో మెరిసిన నటి ధన్య

సిటీలో దాండియా ఈవెంట్స్ కలర్‌‌ఫుగా జరుగుతున్నాయి. వీరభద్ర క్రియేషన్స్ సోమవారం టిక్ టాక్ దాండియా ఈవెంట్ ని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో నిర్వహించింది. నటీనటులు పాల్గొని దాండియా ఆడుతూ ఆకట్టుకున్నారు. దసరా అనగానే నగరమంతా కోలాటాలతో నిండిపోతుంది..

కానీ ఈసారి టిక్ టాక్ నటీనటులతో కలిసి ఆడే అవకాశం లభించినందుకు ఆనందిస్తున్నానని సినీ నటి ధన్య బాలకృష్ణ పేర్కొన్నారు. టిక్ టాక్ నటుల అందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమం చేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఈవెంట్‌‌ నిర్వాహకురాలు హేమలత రెడ్డి (బుజ్జి యాక్టర్)  తెలిపారు. నటులు హర్షిత్ రెడ్డి, అవినాష్, కళ్యాణ్, జిగేల్ రాజా తదితరులు పాల్గొన్నారు.

– హైదరాబాద్, వెలుగు

 

Latest Updates