రజనీకాంత్ తో బెస్ట్ డబ్బింగ్ సెషన్ ఇది: మురుగదాస్

రజనీకాంత్, మురుగదాస్ కాంబినేషన్‌ లో ‘దర్బార్’ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీకి సంబంధించిన ఏ అప్‌ డేట్ వచ్చినా వెంటనే వైరల్ అవుతోంది. దాంతో మురుగదాస్ కూడా ప్రతి విషయాన్నీ సోషల్ మీడియాలో ఫోస్ట్ చేసి క్యూరియాసిటీని పెంచుతున్నాడు. రీసెంట్‌‌గా ఈ ఫొటోని పోస్ట్ చేసి .. ‘డబ్బింగ్ పూర్తయింది. ఇదొక బెస్ట్ డబ్బింగ్ సెషన్’ అంటూ ట్వీట్ చేశాడు.

ఈ మూవీలో రజనీ లుక్, స్టైల్‌‌తో పాటు డైలాగ్ డెలివరీ కూడా డిఫరెంట్‌‌గా ఉంటుందట. దాంతో మురుగదాస్ పోస్ట్ చూడగానే మేము మూవీ కోసం వెయి టింగ్ అంటూ ఫ్యాన్స్‌ ఉత్సాహంగా  చెబుతున్నారు. సూపర్‌‌‌‌ స్టార్‌‌‌‌ మూవీ అంటే ఆ మాత్రం క్రేజ్ ఉంటుందిగా మరి!

Latest Updates