దాసరి అవార్డును అందుకున్న పీపుల్ స్టార్

dasari-award-take-r-narayana-murty

దాసరి నారాయణరావు పురస్కారం అందుకోవడం అనందంగా ఉందన్నారు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి. తన ఉనికికి కారణం దాసరని చెప్పారు. ప్రభుత్వాలు అవార్డ్ లు ప్రకటించి, వాటిని మరిచి పోయాయని ఆరోపించారు. సీవెల్ కార్పొరేషన్‌‌ సౌజన్యంతో ప్రాజ్ఞిక ఫౌండేషన్ ఆధ్వర్యం లో ‘సంగీత సాహిత్య సమలంకృతే..’ పేరిట రవీంద్రభారతిలో గురువారం కార్యక్రమం జరిగింది. నారాయణమూర్తిని దాసరి పురస్కా రంతో పాటు ‘చలన చిత్ర విప్లవ యోధాగ్రణి’ బిరుదును ప్రదానం చేసి సన్మానించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నారాయణమూర్తి..ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చి, కళాకారులు, రచయితలను గుర్తించి అవార్డులు ప్రదానం చేయాలని చెప్పారు. నాయకులు డబ్బులు తీసుకుని గుర్తింపులేని వారికి అవార్డులివ్వడం బాధాకరం అన్నారు. మద్రాస్ లో నాకు అన్నం పెట్టి ఆకలి తీర్చిన మహానుభావుడు దాసరి నారాయణరావు అని గుర్తు చేసుకున్నారు.  నా గురువు దాసరి పేరుతో అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉందన్నాడు. త్వరలో తాను తెరకెక్కించిన ప్రజాస్వామ్యం సినిమాను రిలీజ్ చేస్తానని తెలిపారు నారాయణమూర్తి.

Latest Updates