రాఫెల్ లో ఏ స్కామ్ లేదు: ఫ్రాన్స్ కంపెనీ చీఫ్

బెంగళూరు: రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో ఏ కుంభకోణం జరగలేదని ఫ్రాన్స్ కంపెనీ దసాల్ట్ ఏవియేషన్ సీఈవో ఎరిక్ ట్రాపియర్ స్పష్టం చేశారు. ఇండియా ప్రభుత్వంతో జరిగిన డీల్ ప్రకారం 36 యుద్ధ విమానాలను అనుకున్న టైం ప్రకారం అందిస్తామని చెప్పారు. ఒక వేళ మరిన్ని ఫైటర్ జెట్స్ కోసం భారత్ ఆర్డర్ చేస్తే తామింకా ఆనదిస్తామన్నారు. బెంగళూరులో జరుగతున్న ఎయిర్ షోలో బుధవారం ఆయన పాల్గొన్నారు.

రాఫెల్ యుద్ధ విమానాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఈ యుద్ధ విమానాలను భారత ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు నడుపతారు. వాటితో ఆకాశంలో విన్యాసాలు చేస్తారు.

రాఫెల్ యుద్ధ విమానాల ప్రదర్శన తమకెంతో ఆనందంగా ఉందని చెప్పారు ఎరిక్. అలాగే నాగ్ పూర్ లో రిలయన్స్ తో కలిసి మేకిన్ ఇండియాలో భాగంగా తయారుచేసిన ఫాల్కన్-2000 కాక్ పిట్ ను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నామన్నారు. ఇది తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఏడాదిలోపే మేకిన్ ఇండియాలో వీటిని పూర్తి చేసినట్లు చెప్పారాయన.

రాఫెల్ డీల్ లో పెద్ద కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికల్లో దాన్నే ప్రధాన అస్త్రంగా చేసుకునే ప్రచారంలోకి దిగుతున్నాయి. ఈ సమయంలో దసాల్ట్ చీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Latest Updates