డేటా చోరీ కేసు : ఐటీ గ్రిడ్ ఎండీ అరెస్ట్ కు రంగం సిద్ధం

డేటా చోరీ కేసుకు సంబంధించి రిపోర్ట్ ఇచ్చింది ఆధార్ అథారిటీ. సిట్ ఇచ్చిన నోటీసులపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆధార్ అధికారులు. రెండు రాష్ట్రాలకు చెందిన ఆధార్ డేటా చోరీ అయ్యిందని ఫిర్యాదులో తెలిపారు. ఆధార్ చట్టం సెక్షన్ 37, 38A,B,G. 40, 42, 44 ప్రకారం డేటా చోరీకి సంబంధించి మాదాపుర్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. మరోవైపు FSL రిపోర్ట్ ఆధారంగా చర్యలకు సిద్దమైయ్యారు సిట్ అధికారులు. ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కుమార్ తో పాటు మరికొంత మందిని అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారు.

Latest Updates