కరీంనగర్​ ఐటీ టవర్ ​ప్రారంభానికి డేట్ ఫిక్స్

కరీంనగర్‍ అర్బన్‍, వెలుగు: కరీంనగర్‍లో ఐటీ టవర్‍ను ఈ నెల 30న ప్రారంభిస్తామని మంత్రి గంగుల పేర్కొన్నారు. శుక్రవారం పనులను మంత్రి పరిశీలించారు. కేటీఆర్ చేతుల మీదుగా ఐటీ టవర్ ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. టవర్ లో ఏర్పాటు చేసే కంపెనీలతో దాదాపు 3000 మందికి  ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు.

ఇప్పటికే 11 కంపెనీలతో ఎంవోయూలు పూర్తికాగా, మరిన్ని కంపెనీలు వస్తాయని, నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. 30న ఓపెనింగ్ తోపాటు ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తారని తెలిపారు.

Latest Updates