ఫ్యాక్టరీ సీజ్ : ఫార్మా పేరుతో మత్తు మందు తయారీ

హైదరాబాద్ : ఫార్మా పేరుతో సెక్స్ మత్తు మందులు తయారు చేస్తున్న ఫ్యాక్టరీని సీజ్ చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. హైదరాబాద్ నాచారంలోని ఓ ఫ్యాక్టరీలో ఐదేళ్లుగా సీక్రెట్ గా మత్తు మందులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు.  బెంగళూరులో మత్తు మందులు సరఫరా చేస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకోవడంతో ..హైదరాబాద్ లోని ఓ ఫ్యాక్టరీలో ఈ మత్తు మందులు తయారయ్యే విషయాలు తెలిశాయని తెలిపారు. KETAMINE  అనే మత్తు మందును తయారు చేస్తున్నారని తెలిసిందన్నారు.

మహిళలపై వాడెందుకు ఈ డ్రగ్ ఉపయోగపడుతుందని.. ఈ మత్తు మందు తీసుకున్న తర్వాత ఐదు గంటలపాటు అమ్మాయిలు సృహ కోల్పోతారని తెలిపారు అధికారులు. సృహ కోల్పోయిన అమ్మాయిలపైన అబ్బాయిలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు తేలిందన్నారు. ఈ క్రమంలోనే అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో..బెంగళూరులో ఓ ముఠా దొరికిందన్నారు.

ముఠాను పట్టుకోవడంతో సెక్స్ మత్తు మందు వ్యవహారం తెలిసిందన్నారు. ఈ ముఠా ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాదులో సోదా చేసినట్లు తెలిపారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. నాచారంలోని  ల్యాబ్ ని నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపిన అధికారులు.. ల్యాబ్ ని సీజ్ చేశామన్నారు.

Latest Updates