ఘనంగా అలయ్ బలయ్

హైదరాబాద్ లో అలయ్ బలయ్ నిర్వహించారు హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మీ. ఈ కార్యక్రమానికి దత్తాత్రేయ సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఏటా దసరా తర్వాత అలయ్ బలయ్ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.

హైదరాబాద్ లో దత్తాత్రేయ ఏటా అలయ్ బలయ్ నిర్వహిస్తున్నారు. తాజాగా హిమాచల్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టడంతో దత్తాత్రేయ కుమార్తె ఈ బాధ్యతలు చూసుకున్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ పలువురిని సన్మానించారు.