దళితుడితో ప్రేమ పెండ్లి : రక్షణ కోరిన ఎమ్మెల్యే కూతురు

తన తండ్రికి ఇష్టం లేని పెండ్లి చేసుకున్నందుకు తనను, తన భర్తను చంపాలని చూస్తున్నట్లు తెలిపింది ఓ అమ్మాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని… బిథారి చేన్ పూర్ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా కూతురు సాక్షి మిశ్రా (23) అజితేశ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే తాను ఒక దళితున్ని పెండ్లి చేసుకోవడంతో తమ ఇంట్లో వాళ్లు తమపై కక్షకట్టారని తెలిపింది. పెండ్లి అయినప్పటినుంచి తన తండ్రి దగ్గర ఉండే గుండాలు తమను వెంబడిస్తున్నారని.. ఎటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పింది.  తమకు పోలీసు ప్రోటెక్షన్ కావాలని కోరింది, ఇందుకు గాను బుధవారం ఓవీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయంపై రాష్ట్ర డీజీపీ స్పందించారు.. తాము రక్షణ కల్పించడానికి రెడీగా ఉన్నామని తెలిపారు. అయితే ముందు సాక్షీ, అజిత్ ఎక్కడవున్నారో చెప్పాలని కోరారు.

Latest Updates