కంగనా మా ఆడబిడ్డ.. ఆమెకు రక్షణ కల్పిస్తాం

హిమాచల్ సీఎం జైరామ్ ఠాకూర్

షిమ్లా: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు సెక్యూరిటీ కల్పిస్తామని హిమాచల్ ప్రదేశ్ సర్కార్ తెలిపింది. సొంత రాష్ట్రమైన హిమాచల్ లోనేగాక త్వరలో ముంబై వెళ్లనున్నందున అక్కడా కంగనాకు రక్షణను పొడిగించడంపై హిమాచల్ ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. కంగనా ప్రొటెక్షన్ విషయంపై హిమాచల్ సీఎం జైరామ్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చారు. ‘కంగనా సోదరి నాతో టెలిఫోన్ లో మాట్లాడింది. సెక్యూరిటీ కల్పించాలని కోరుతూ ఆమె తండ్రి స్టేట్ పోలీస్ శాఖకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రక్షణ ఏర్పాట్లు చేయాలని డీజీపీకి చెప్పా. కంగనా హిమాచల్ ఆడబిడ్డ. ఆమె సెలబ్రిటీ కూడా అయినందున సెక్యూరిటీ కల్పించడం మా బాధ్యత’ అని ఠాకూర్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర పోలీసులపై చేసిన కామెంట్స్ కు కంగనా సారీ చెప్పాలని శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. ఆమెను ముంబైకి రావొద్దని హెచ్చరించారు. ఈ వివాదానికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా లేదు.

Latest Updates