క‌న్నతండ్రిపై కూతుళ్ల దాష్టీకం.

daughters bullying her father badly.

క‌ని పెంచి పెద్ద‌చేసిన క‌న్న‌తండ్రిని హీనంగా హింసించారు అత‌ని కూతుళ్లు. క‌నిక‌రం లేకుండా క‌టిక చీక‌టిలో జంతువుల మ‌ధ్య ప‌డేసి తండ్రిని కూడా ఓ ప‌శువులా చూశారు. 96 ఏళ్ల తండ్రిని 60 ఏళ్ల పైబ‌డిన కూతుళ్లు హింసించిన ఈ సంఘ‌ట‌న కాలిఫోర్నియాలోని వెంచురా కౌంటీ ఏరియాలో చోటు చేసుకుంది. ఆ ఏరియాలోని ప్ర‌జ‌ల ఆరోగ్య ప‌రిస్థితులు తెలుసుకునేందుకు అధికారులు త‌నిఖీలు చేయ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌పడింది. తొలుత అధికారులు కుటుంబ స‌భ్యుల గురించి వివ‌రాలు అడిగి, ఆ త‌ర్వాత ఇంటిని ప‌రిశీలించ‌బోయారు. అందుకు కూతుళ్లు ఒప్పుకోక‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చి పోలీస్ అధికారుల‌కు స‌మాచార‌మిచ్చారు. పోలీసులు వాళ్ల స్టైల్ లో ప్ర‌శ్నించ‌డంతో ఇంటి లోప‌ల త‌నిఖీల‌కు అనుమ‌తిచ్చారు. లోప‌లికెళ్లిన అధికారులకు ఆ వృద్ధుడు ర‌క‌ర‌కాల జంతువుల మ‌ధ్య ప‌డి ఉన్న దృశ్యం పోలీసులుకు క‌న‌ప‌డింది. కుక్కలు, కుందేళ్లు, పిల్లులు, చిలుకలు, అడవి ఎలుకలు… ఇలా రకరకాల జంతువుల మ‌ధ్య అత‌ని శ‌రీరాన్ని ఎలుకలు పీక్కు తిన‌డం చూసి షాక్‌కి గుర‌య్యారు. క‌న్న‌కూతుళ్లు ఆ తండ్రికి చూపిస్తున్న న‌ర‌కాన్ని చూసి నివ్వెర‌పోయారు. ఇంత‌టి దారుణానికి ఒడిగ‌ట్టిన ఆ ఇద్దరు కూతుర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి తండ్రిని వృద్ధాశ్రమానికి తరలించారు.

Latest Updates