ఫోర్బ్స్ లిస్ట్ లో పెరిగిన భారతీయ మహిళలు

సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరెస్ట్ వరకు సత్తా చాటిన భారతీయ మహిళలు

పేదరికాన్ని లెక్కచేయకుండా పైకి వచ్చారు

ఇంటర్నేషనల్ వేదికల్లో భాగమయ్యారు

సెల్ఫ్ మేడ్ ఇండియన్ ఉమెన్‌‌పై ప్రత్యేక స్టోరీ

ఇంట్లో ఆడపిల్ల ఉంటే.. ఆ సందడే వేరు. ఇల్లంతా కళకళలాడుతూ… ఎప్పుడు నవ్వుల పువ్వులు విరజిల్లుతూ ఉంటాయి. ఆడపిల్ల ఇంటికి లక్ష్మిదేవి అని కూడా అంటుంటారు. ఈ డాటర్స్‌‌ను గుర్తు తెచ్చుకోవడానికి కూడా ఒక రోజు ఉంది. సెప్టెంబర్ నెలలో చివరి ఆదివారం ఇండియాలో ప్రతి ఒక్క ఫ్యామిలీ హ్యాపీ డాటర్స్ డేను’ జరుపుకుంటూ ఉంటోంది. ఎక్కడెక్కడో ఉండే తమ కూతుర్లకు ఈ సందర్భంగా విషెష్ చెప్తూ ఉంటారు. గర్ల్స్‌‌ను తమ సొంత కాళ్ల మీద తాము నిలబడేలా చేయడానికి ఈరోజు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా ఎంతో హార్డ్‌ వర్క్‌‌తో, మరెంతో ఆత్మ విశ్వాసంతో తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకుని ఫోర్బ్స్‌‌ లిస్ట్‌ లో చోటు దక్కించుకున్న సెల్ఫ్ మేడ్ ఇండియన్ ఉమెన్ ఎవరో చూద్దామా..! – వెలుగు, బిజినెస్‌‌డెస్క్

 

పూర్ణ మాలవత్.. మౌంటేనీర్..

పూర్ణ మాలవత్.. తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలోని వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. ఎవరెస్ట్‌‌ను ఎక్కిన ప్రపంచంలోనే తొలి యంగెస్ట్‌‌ గర్ల్‌‌గా పూర్ణ నిలిచారు. ఎవరెస్ట్‌‌ను ఎక్కే క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లపై రాహుల్ బోస్ ‘పూర్ణా.. కరేజ్ హాజ్ నో లిమిట్’ అనే సినిమాను కూడా చేశారు. ప్రస్తుతం మాలవత్ అమెరికాలో హయ్యర్ స్టడీస్ చేస్తున్నారు. గర్ల్స్ ఏదైనా సాధిస్తారని నిరూపించేందుకే తాను మౌంట్ ఎవరెస్ట్‌‌ను అధిరోహించినట్టు పూర్ణ మాలవత్ చెబుతారు.

ద్యుతీ చంద్… స్ప్రింటర్..

100 మీటర్స్‌ రన్‌ లో నేషనల్ రికార్డు హోల్డర్. 2018 ఆసియన్ గేమ్స్‌ లో డబుల్ సిల్వర్ మెడలిస్ట్. సమ్మర్ ఒలింపిక్ గేమ్స్‌ లో ఉమెన్100 మీటర్స్ ఈవెంట్‌ కు క్వాలిఫై అయిన మూడో ఇండియన్ ఉమెన్‌ గా ద్యుతీ నిలిచారు. 2019లో వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌ లో గోల్డ్ మెడల్ దక్కించుకున్న తొలి మహిళ కూడా ఈమెనే. కానీ 2014లో హైప రాండ్రోజనిజంతో ఆమెను బ్యాన్ చేశారు. ఈ విషయంపై ద్యుతీ వరల్డ్ అథ్లెటిక్స్ బాడీతో సైతం ఫైట్ చేశారు. ఆ తర్వా త ఆమె బ్యాన్‌ ను తొలగించారు. సేమ్ సెక్స్ రిలేషన్‌ షిప్ గురించి మాట్లాడి, ఎల్‌‌జీబీటీక్యూ ప్లస్ కమ్యూనిటీలో మెంబర్ అయిన తొలి అథ్లెట్ ఈమెనే. అత్యంత పేదరిక కుటుంబం నుంచి ద్యుతీ వచ్చారు. ప్రస్తు తం ద్యుతీ ఒడిశా మైనింగ్ కార్పొరేషనల్ లిమిటెడ్‌ లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌‌‌‌గా పనిచేస్తు న్నారు.

 

అంకితి బోస్.. జిలింగో సీఈవో…

ఫ్యాషన్ రిటైలర్స్ ప్లా ట్‌ ఫా మ్ జిలింగోకు అంకితి సీఈవో. ఈ కంపెనీ వాల్యూ 970 మిలియన్ డాలర్లు. సౌత్ ఈస్ట్ ఆసియన్ మార్కెట్లలో ఈ కంపెనీ పనిచేస్తోంది. 2019లో ఫండ్ రైజ్ చేయడంతో ఈ కంపెనీ యూనికార్న్‌ కంపెనీగా మారేందుకు చేరువైంది. ఆసియాలో ఇంత వాల్యూ ఉన్న స్టార్టప్‌ ను లీడ్ చేస్తో న్న యంగెస్ట్ ఫీమెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ లలో అంకితి ఒకరు. ఆమె వయస్సు 27 సంవత్సరాలు మాత్రమే.

 

కరుణ నంది… సుప్రీంకోర్టు అడ్వకేట్..

సుప్రీంకో ర్టు అడ్వకేట్‌ గా పనిచేస్తో న్న కరుణ నంది హ్యుమన్ రైట్స్, మీడియా స్వేచ్ఛ కోసం ఎక్కువగా పోరాడుతున్నారు . 2012లో ఢిల్లీ గ్యాం గ్ రేప్ జరిగిన తర్వాత.. యాంటీ రేప్ బిల్లు తెచ్చేం దుకు ఆమె ఎంతో కృషి చేశారు. భోపాల్ గ్యాస్ ట్రాజెడీ విషయంలో బాధితుల తరఫున ఆమె నిద్రాహారాలు మానేసి మరీ పోరాడారు. మీడియా ఫ్రీడంను కాపాడేందుకు లీగల్ ఫ్రేమ్‌‌వర్క్స్‌ ను డెవలప్‌ చేసేం దుకు యూకే ప్యానల్ ఎక్స్‌‌పర్స్‌ట్ లో ఆమె కూడా ఒకరిగా ఎంపికయ్యారు.

మోనికా షెర్‌‌‌‌గిల్.. డైరెక్టర్.. నెట్‌ ఫ్లిక్స్ ఇండియా ఇంటర్నేషనల్ ఒరిజినల్స్…

నెట్‌ ఫ్లిక్స్ ఇండియా సిరీస్ టీమ్‌‌కి మోనికా హెడ్. 20 ఏళ్లకు పైగా మీడియాలో ఉన్న అనుభవంతో ఆమె నెట్‌ ఫ్లిక్స్‌‌లో ఉన్నత స్థానానికి వెళ్లారు. గతంలో వయాకామ్ 18 డిజిటల్ వెంచర్స్, జీ, సోని, స్టార్ ఇండియా నెట్‌ వర్క్‌‌లో పనిచేశారు. స్టార్‌‌‌‌ ప్లస్‌‌, 9 ఇతర నెట్‌ వర్క్ ఛానల్స్‌‌లో వచ్చిన సత్యమేవ జయతే ప్రొగ్రామ్‌‌కు ఆమెనే హెడ్. కంటెంట్ క్వీన్స్‌‌లో ఆమె ఒకరిగా ఉన్నారు. మీ డ్రీమ్స్‌‌ను నెరవేర్చుకుని మీ స్టోరీని మీరే రాసుకోండి అంటూ ఆమె గర్ల్స్‌ ను ప్రోత్సహిస్తూ ఉంటారు.

విద్యా బాలన్… బాలీవుడ్ యా క్టర్..

విద్యా బాలన్… ఈ పేరు తెలియని వారుండరు. బాలీవుడ్‌‌లో లేడీ ఓరియెంటె డ్ మూవీస్‌‌ చేస్తూ తనకంటూ ఒక స్థా నాన్ని సంపాదించుకున్నారు. హిందీ సినిమా ఇండస్ట్రీలో మహిళలను చూపించే విధానంలో మార్పు తీసుకొచ్చారు. ఆమె తీసిన లేడీ ఓరియెంటె డ్ ఫిల్మ్స్‌ కు నేషనల్ ఫిల్మ్ అవార్డు, ఆరు ఫిల్మ్‌‌ఫేర్ అవార్డులతో పాటు పలు అవార్డులు వచ్చాయి. 2014లో కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీని కూడా ఇచ్చింది.

 

అశ్విని అయ్యర్ తివారి.. ఫిల్మ్‌‌మేకర్, రైటర్…

ఫిల్మ్‌‌మేకింగ్ అంటే ఇష్టం .. కానీ జాబ్ వదిలేస్తే పరిస్థితి ఎలా అనే భయం. అయినా కూడా తనకెంతో ఇష్టమైన ఫిల్మ్‌‌మేకింగ్ కోసం ఎన్నో ఏళ్లుగా కెరీర్‌‌‌‌ సెట్ చేసుకున్న అడ్వర్‌‌‌‌టైజింగ్ జాబ్‌‌కు రిజైన్ చేశారు తివారి. 2016లో నీల్ బట్టీ సన్నా టా సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత బరేలీ కీ బర్ఫీ తీశారు. ఈ ఫిల్మ్‌‌ తివారికి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాకు బెస్ట్‌‌ డైరెక్టర్ అవార్డు తివారికి వచ్చింది. 2020లో పంగా కూడా క్రిటిక్స్ మన్నలు పొందింది.

 

Latest Updates