ఐసీసీ చైర్మన్‌ రేసులోకి కామెరూన్

‌కింగ్‌‌స్టన్‌‌: వెస్టిండీస్‌‌ క్రికెట్‌ బోర్డు (సీడబ్ల్ యూఐ) మాజీ ప్రెసిడెంట్ డేవ్‌ కామెరూన్‌‌ ఐసీసీ చైర్మన్‌‌ పదవి రేసులోకి వచ్చారు . పదవీకాలం పూర్తి చేసుకోబోతున్న ప్రస్తుత చైర్మన్ శశాంక్‌‌ మనోహర్‌‌ ప్లేస్‌‌లో ఐసీసీ పగ్గాలు అందుకోవా-లని చూస్తున్నారు. ఇంటర్నేషనల్‌‌ బాడీ టాప్‌ పోస్ట్‌‌ కోసం కామెరూన్‌‌ను రికమెండ్‌‌ చేయాలని అనుకుంటున్నట్టు యూనైటెడ్‌‌ స్టేట్స్‌‌ క్రికెట్‌ .. మనోహర్‌‌కు ఇటీవలే లెటర్‌‌ రాసింది. దాంతో ఐసీసీ చైర్మన్‌‌ ఎలక్షన్స్‌‌లో అదృష్టాన్ని పరీక్షిం-చునేం దుకు కామెరూన్‌‌ రెడీ అయ్యారు. తాను గెలిస్తే అమెరికాలో కూడా క్రికెట్‌ ను అభివృద్ధి చే-స్తానని చెప్పారు . 2013 నుంచి 2019 వరకు సీడబ్ల్ యూఐ ప్రెసిడెంట్‌ గా పని చేసిన డేవ్‌ రేసులో ఉండాలంటే ఆయనకు సపోర్టుగా రెం డు నామి-నేషన్లు అవసరం. కానీ, డేవ్‌ స్థానంలో విండీస్‌‌ క్రికెట్‌ ప్రెసిడెంట్‌గా పగ్గాలు అందుకున్న రికీసెరిట్‌ ఆయనకు సపోర్ట్‌‌ ఇస్తారా లేదా దానిపై క్లారిటీ లేదు. పైగా, ఈ ఇద్దరూ ఓ సారి పబ్లిక్‌‌గా గొడవ పడ్డారు . కాగా, ఐసీసీ టాప్‌ పోస్టు కోసం ఇంగ్లండ్‌‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ కొలిన్‌‌ గ్రేవ్‌ ప్రధాన పోటీదారుగా ఉన్నారు. ఈ మధ్య బీసీసీఐ ప్రెసిడెంట్‌ సౌరవ్‌ గంగూలీ పేరు కూడా వినిపిస్తోంది. కానీ, ఈ విషయంలో బీసీసీఐ గానీ, దాదా గానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

Latest Updates