ఈ పెయింటింగ్ విలువ రూ.212 కోట్లు

పెయింటింగ్ చూశారుగా.. స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు పైకి చిమ్ముతున్నయ్ ! మరి, అందులోకి డైవ్ చేసిన మనిషి కనిపిస్తున్నడా..? కనిపించట్లేదు కదా! అవును, కనిపించడు. ఆ మనిషి నీళ్లల్లకు అట్ల దునకడం వల్లే నీళ్లు అట్ల పైకి చిమ్మి నయ్ . ఇది డేవిడ్ హాక్నీ అనే ఆర్టిస్ట్ వేసిన పెయింటింగ్ . ‘ద స్ప్లాష్ ’ పేరిట మూడు పెయింటింగ్ లను బ్రిటన్ కు చెందిన ఆ ఆర్టిస్ట్, 1966, 1 9 67 ల్లో వేశాడట. మంగళవారం లండన్ లోని సొథెబీ అనే వేలం సంస్థ, ఆ ఆర్ట్ ను వేలం వేసింది. కొన్నది ఎవరో తెలియదుగానీ, దానిని రూ.212 కోట్ల (2.98 కోట్ల డాలర్లు)కు  పాడుకున్నడు. మూడు సేమ్ ఆర్ట్ లే అయినా, సైజులో మాత్రం తేడాలుంటయ్ . అందులో అతి పెద్దది 96/95 అంగుళాల సైజులో ఉంటదట. దాని పేరు ‘ఏ బిగ్గర్ స్ప్లాష్ ’. ఇప్పుడు వేలం వే సిన పెయింటింగ్ , అందులో రెండోది. దీని సైజు 72/72 అంగుళాలు. మూడోది ‘ద లిటిల్
స్ప్లాష్ ’. అది ప్రస్తుతం ఎవరో ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉందట. ఇప్పటి దాకా వేలంలో అమ్ముడైన పెయింటింగ్ లలో మూడో ఎక్కువ ధర ‘ద స్ప్లాష్
’దేనని సొథెబీ అధికారులు చె బుతున్నరు. అయితే, ద స్ప్లాష్ ను వేలం వేయడం ఇదే మొదటిసారి కాదని అంటున్నరు. అంతకుముందు 2006లో వేలం వేయగా అది సు మారు రూ.38.5 కోట్లకు (54 లక్షల డాలర్లు) అమ్ముడుపోయిందట. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎక్కువకు అమ్ముడైంది.

Latest Updates