వార్నర్ కు మోజు తీరట్లే.. స్టేడియంలో బుట్టబొమ్మ స్టెప్పులు

బుట్టబొమ్మా బుట్టబొమ్మ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలుసు. ఈ సాంగ్ దేశ విదేశాల్లో కూడా బాగా ఆదరణ పొందింది. టిక్ వీడియోల్లో చాలా సార్లు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ బుట్టాబొమ్మ పాటకు తన భార్యతో కలిసి స్టెప్పులేశాడు. ఈ వీడియో అప్పట్లో చాలా వైరల్ అయ్యింది.  ఐపీఎల్ లో కూడా మరో సారి బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేశాడు. అయితే వార్నర్ కు బుట్టబొమ్మ  పాట మీద మోజు తీరట్లే.. లేటెస్ట్ గా ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరిగిన ఫస్ట్ వన్డేలో ఫ్యాన్స్ కోరిక మేరకు వార్నర్ మరోసారి క్రికెట్ స్టేడియంలోనే డ్యాన్స్ చేశాడు. ఫీల్డింగ్ చేస్తుండగా అభిమానులు వార్నర్..వార్నర్…బుట్టబొమ్మా అంటూ అరవడంతో వార్నర్ కొద్దిసేపు స్టేడియంలో డ్యాన్స్ చేసి అలరించాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  వార్నర్ కు తెలుగు పాటలంటే ఎంత ఇష్టమో అని అందరూ అనుకుంటున్నారు. ప్లేస్ మారింది అంతే బుట్టబొమ్మ మీద ప్రేమ మారలేదంటూ సన్ రైజర్స్ ట్వీట్ చేసింది.

Latest Updates