ఏదో ఒక రోజు లారా రికార్డ్ బద్దలు కొడతా

టెస్టు క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు బ్రియన్ లారా(400) నాటౌట్ ..15 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉంది. అయితే ఇటీవల ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ పాకిస్తాన్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో 335 నాటౌట్ గా నిలిచాడు. అందరూ లారా రికార్డ్ ను  బ్రేక్ చేస్తాడనుకున్నారు. కానీ కెెప్టెన్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో రికార్డ్ మిస్ అయ్యింది.

అయితే లేటెస్ట్ గా బ్రియన్ లారా తనను కలిసిన ఫోటోను డేవిడ్ వార్నర్ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఎప్పటికైనా లారా 400 వ్యక్తిగత స్కోరును బద్దలు కొట్టే రోజు తప్పకుండా వస్తుందన్నాడు వార్నర్. లారా తనను అభినందించడం ఆనందంగా ఉందన్నాడు.  వార్నర్ తప్పకుండా తన రికార్డ్ ను బద్దలు కొడతాడనుకుంటున్నా అని లారా అన్నాడు. వార్నర్ ఎప్పుడూ నిలకడగా రాణించే బ్యాట్స్ మెన్ అని అన్నాడు లారా.

Latest Updates