‘అమరేంద్ర బాహుబలి అనే నేను..’ వార్న‌ర్ న్యూ గెట‌ప్

లాక్‌డౌన్‌ నేపథ్యంలో త‌న‌కు దొరికిన ఖాళీ స‌మ‌యాన్ని టిక్‌టాక్‌లతో అదరగొట్టేస్తున్నాడు ఆస్ట్రేలియన్ క్రికెటర్‌ డేవిడ్ వార్నర్. ముఖ్యంగా తెలుగు సినిమాల్లోని పాటలు, డైలాగ్‌లకు డ్యాన్స్‌లు, యాక్షన్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. ఇటీవల అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురంలో..’ సినిమాలోని ‘బుట్ట‌బొమ్మా’ , ‘రాములో రాములా’ పాటలకు త‌న కుటుంబంతో క‌ల‌సి స్టెప్పులు వేశాడు. ఆ త‌ర్వాత మహేష్ బాబు న‌టించిన ‘పోకిరి’ సినిమాలోని ఒక్క‌సారి క‌మిటైతే నా మాట నేనే విన‌ను అంటూ టిక్‌టాక్ చేశాడు.

తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సినిమాలో గెటప్ వేశాడు వార్న‌ర్ . ఈ సినిమాలోని అమరేంద్ర బాహుబలి అవతారం ఎత్తాడు. ‘బాహుబలి’ సినిమాలోని ‘అమరేంద్ర బాహుబలి అను నేను..’ అంటూ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా పేరు చెప్పండి చూద్దాం..’ అంటూ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

Latest Updates