మహేశ్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన డేవిడ్ భాయ్

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు 45వ పడిలోకి అడుగుపెట్టాడు. ఆదివారం పుట్టిన రోజు జరుపుకుంటున్న మహేశ్‌కు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. మహేశ్‌కు ఓ స్పోర్ట్స్‌మన్ కూడా బర్త్‌డే విషెస్ చెప్పాడు. అతడే ఆస్ట్రేలియ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఐపీఎల్‌లో వార్నర్ సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ వాయిదా పడుతూ రావడంతో, లాక్‌డౌన్‌ టైమ్‌లో వార్నర్ టిక్‌టాక్ వీడియోలతో తెలుగు ఫ్యాన్స్‌ను అలరించాడు. టిక్‌టాక్ వీడియోలతో ఆకట్టుకోవడంతో ఫ్యాన్స్‌ డేవిడ్ భాయ్ అంటూ వార్నర్‌‌పై స్పెషల్ మీమ్స్ తయారు చేశారు.

View this post on Instagram

Happy birthday @urstrulymahesh legend #mindblock #dance

A post shared by David Warner (@davidwarner31) on

ముఖ్యంగా మహేశ్ బాబు నటించిన పోకిరిలోని నేను ఒక్కసారి చెబితే అనే డైలాగ్‌ టిక్‌టాక్‌తో వార్నర్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. అలాగే మహేశ్ రీసెంట్ హిట్ సరిలేరు నీకెవ్వరులోని మైండ్ బ్లాక్ పాటకు తన వైఫ్‌తో కలసి అదిరిపోయే స్టెప్పులు వేశాడు. తాజాగా మహేశ్ పుట్టిన రోజుకు వార్నర్ విష్ చేశాడు. భార్యతో కలసి డ్యాన్స్ చేసిన మైండ్ బ్లాక్ టిక్‌టాక్ వీడియోను మరోమారు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వార్నర్‌‌.. హ్యాపీ బర్త్‌డే లెజెండ్ మహేశ్ అని క్యాప్షన్ జత చేశాడు. అలాగే మహేశ్‌ను ఈ పోస్ట్‌లో ట్యాగ్ చేశాడు. ఈ వీడియోకు గంటలోనే 3.5 లక్షల లైక్స్ రావడం విశేషం. సన్‌రైజర్స్‌ తరఫున బ్యాటుతో అదరగొట్టే వార్నర్‌‌కు హైదరాబాద్ సెకండ్ హోమ్‌గా మారింది. 2016లో సన్‌రైజర్స్ కప్ కొట్టడంలో ఈ ఓపెనర్ బ్యాట్స్‌మన్ కీలక పాత్ర పోషించాడు.

Latest Updates