యంగ్ టైగర్ కు వార్నర్ బర్త్ డే గిఫ్ట్ అదిరింది

ఈ మధ్య టాలీవుడ్ సినిమాల పాటలు, డైలాగ్ లతో వరుస టిక్ టాక్ వీడియోలు చేస్తూ అందరి దృష్టి ఆకర్షిస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్  డేవిడ్ వార్నర్  లేటెస్ట్ గా మరో టిక్ టాక్  వీడియోతో అదరగొట్టాడు. ఇవాళ టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా జనతా గ్యారేజ్ లోని పక్కా లోకల్ పాటకు తన భార్య క్యాండిస్ తో కలిసి స్టెప్పులేశారు. తారక్ కి  బర్త్ డే విషెస్ చెప్పిన వార్నర్ ..ఈ రోజు గొప్పగా ఉండాలన్నాడు..  డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించాం..కానీ నీ డ్యాన్స్ చాలా ఫాస్ట్  అని వార్నర్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ దీనిని రీ ట్వీట్ చేసింది.

Latest Updates