దావుద్ తమ్ముడి కొడుకు అరెస్ట్..

dawood-ibrahim-brother-son-arrested-by-anti-extortion-cell-in-mumbai-air-port

ముంబై: దావుద్ ఇబ్రహీం తమ్ముడు ఇక్బాల్ కస్కర్ కొడుకైన రిజ్వాన్ కస్కర్ ను  ముంబై యాంటీ ఎక్స్ స్టోర్షన్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రిజ్వాన్ బుధవారం రాత్రి దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నించగా అతన్ని ముంబై ఎయిర్ పోర్ట్ లో పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు.

రెండు రోజుల క్రితం ముంబై పోలీస్ కు చెందిన యాంటీ ఎక్స్ స్టోర్షన్ సెల్ అహ్మద్ రాజా వధారియా ను పట్టుకున్నారు. ఇతను దావుద్ గ్యాంగ్ మెంబర్ అయిన ఫహిమ్ కు దగ్గరివాడు. అహ్మద్ ను విచారించగా… రిజ్వన్ కస్కర్ బుధవారం రాత్రి దేశం విడిచి పారిపోతున్నట్లు తెలుసుకున్నారు. దీంతో పక్కా పధకం తో రిజ్వాన్ ను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest Updates