సైరా, వార్ తొలిరోజు కలెక్షన్లు ఇవే

అక్టోబర్ 2వ తేదీన మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి, హృతిక్ – టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో వార్ సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. బ్లాక్ బస్టర్ హిట్స్ అనిపించుకున్నాయి. దీంతో.. వసూళ్లు ఈ వారం కూడా స్టెడీగా కొనసాగుతాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తొలిరోజు అక్టోబర్ 2న ఈ రెండు సినిమాలు భారీ వసూళ్లను రాబట్టాయి. నార్తిండియాలో వార్ సినిమా ఆల్మోస్ట్ కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. సౌతిండియాలో సైరా సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టించింది.

వార్ మూవీ డే1లో ప్రపంచవ్యాప్తంగా  రూ.53.35 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. వార్ మూవీ ఇండియాలో 4వేల స్క్రీన్లు, ఫారిన్ లో 1350 కలుపుకుని.. వరల్డ్ వైడ్ గా 5350 స్క్రీన్లపై రిలీజైంది. 2018లో ఆమిర్ ఖాన్-అమితాబ్ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ మూవీ సాధించిన ఫస్ట్ డే వసూళ్ల రికార్డు రూ.52.25కోట్లను వార్ మూవీ బ్రేక్ చేసింది. 

మెగాస్టార్ సైరా మూవీ… ఫస్ట్ డే.. ప్రపంచవ్యాప్తంగా రూ.51.88కోట్లను కొల్లగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ వసూళ్లు సాధించిన రెండో సినిమాగా నిలిచింది సైరా. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మూడో తెలుగు సినిమా సైరా. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ వెర్షన్లతో కలిపి.. సౌతిండియాలో అత్యధిక కలెక్షన్లు సంపాదించిన ఐదో సినిమాగా సైరా రికార్డుల కెక్కింది. సైరా సినిమా నార్త్ అమెరికాలో తొలిరోజు 1 మిలియన్(రూ.7కోట్లకు పైనే) మార్క్ దాటింది.

మిడ్ వీక్ లో రిలీజైన ఈ సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో.. వీకెండ్ లోనూ.. వచ్చే వారంలోనూ రన్ టైమ్ బాగుంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు.

Latest Updates