డీసీసీల చుట్టూ లోకల్ పాలిటిక్స్

రాష్ట్రంలో లోకల్ పాలిటిక్స్ డీసీసీల చుట్టూ తిరుగుతున్నాయి . స్థానిక ఎన్నికల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చక్రం తిప్పనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను నిర్ణయించే అధికారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం డీసీసీలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏ ఫారాలను డీసీసీ అధ్యక్షులకు అందజేసిన పీసీసీ చీఫ్ ఉత్తమ్.. బీ ఫారాలను డీసీసీ చీఫ్ లే అందజేస్తారని ప్రకటించారు. రాష్ట్ర నాయకత్వం జోక్యం లేకుండా, విధేయులైన నాయకులకే టికెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో జిల్లా నాయకత్వాలకు పీసీసీ పూర్తి బాధ్యతలు అప్పగించింది. పీసీసీ తాజా నిర్ణయంతో లోకల్ బాడీ ఎన్నికల్లో టికెట్ ఆశించే నాయకులకు హైదరాబాద్ వచ్చే బాధ తప్పింది. గాంధీ భవన్ లో నేతల కోసం పడిగాపులు కాయాల్సిన పని లేకుండా పోయింది. టికెట్ కోసం రాష్ట్రస్థాయిలో పీసీసీ నేతల చుట్టు ప్రదక్షిణ చేయాల్సిన పని లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో నాయకుల పనితీరు ఎలా ఉంది, క్యాడర్ తో వారి సంబంధాలు ఎలా ఉన్నాయి, ప్రజల్లో వారిపై ఎలాంటి అభిప్రాయం ఉందనే విషయాలపై తెలుసుకునేందుకు డీసీసీలు, మండల కమిటీలు ఇప్పటికే మండలాల వారీగా సమావేశాలను నిర్వహించాయి. జడ్పీటీసీగా ఎవరుండాలి, ఎంపీటీసీగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నాయి.

 

Latest Updates