డీసీఎం బీభత్సం.. నలుగురుకి తీవ్ర గాయాలు

హైదరాబాద్ లో డీసీఎం బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన డీసీఎం అదుపుతప్పి కారు పైకి దూసుకెళ్లింది. దీంతో పలువురు గాయపడ్డ సంఘటన సోమవారం సాయంత్రం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సాగర్ హైవే ఇంజపూర్ వద్ద బ్రేకులు ఫెయిల్ కావడంతో దేవరకొండ వైపు వెళ్తున్నడీసీఎం, బీ ఎన్ రెడ్డి వైపు వెళ్తున్న కారు పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్ననలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ట్రీట్ మెంట్ కోసం హాస్పిటల్ కి తరలించారు. సమాచారం అందుకున్న వనస్థలిపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Latest Updates