లారీని ఢీకొట్టిన DCM: గాయపడిన డ్రైవర్

కంటైనర్ లారీని వెనుక నుండి డిసిఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదం రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్టేషన్ పరిదిలోని రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగింది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న DCM రావిర్యాల EXIT నెం 13 దగ్గర ఆగివున్న లారీని గుద్దింది. ఈ ఘటనలో DCM డ్రైవర్ రెండు వాహనాల మద్య ఇరుక్కుపోయాడు. ప్రమాదం మంగళవారం పొద్దున 4.45 నిమిషాలకు జరిగింది. పోలీసులకు సమాచారం అందివ్వగా.. ఘటనా స్థలానికి చేరుకుని… సుమారు గంటసేపు  ప్రయత్నించి డ్రైవర్ ను బయటకు తీసి హాస్పిటల్ కు తరలించారు.

Latest Updates