ఆస్పత్రికి వచ్చేసరికే కోడెల మృతి: డీసీపీ

KODELA SUCIDEహైదరాబాద్: ఏఫీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ చెప్పారు. ఆయన ఈ రోజు ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారని అన్నారు. బసవతారకం కేన్సర్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లేసరికే కోడెల ప్రాణాలతో లేరని వైద్యులు నిర్థారించారని డీసీపీ చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత గానీ  ఆయనది ఆత్మహత్యా కాదా అన్న విషయం చెప్పలేమని అన్నారు.

KODELA DEATH CASE
కోడెల మృతదేహం

Latest Updates