గంభీర్ కు అరుదైన గౌరవం

భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు అరుదైన గౌరవం లభించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్  స్టేడియంలోని ఒక స్టాండ్ కు గంభీర్ పేరు పెట్టాలని డిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిర్ణయించింది. వచ్చే నెలలో ఏర్పాటు చేయబోతున్న స్టాండ్ కు గంభీర్ పేరు పెట్టనున్నారు. గంభీర్ భారత్ తరపున 58 టెస్టులు, 147 వన్డేలు,37 టీ20 మ్యాచ్ లు ఆడాడు.20 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు.  2011 వరల్డ్ కప్ లో గంభీర్ 97రన్స్ తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 2007-2008 లో గంభీర్ సారథ్యంలో ఢిల్లీ రంజీ ట్రోఫి గెలిచింది.

 

Latest Updates