వరద ఉద్ధృతికి పడవ బోల్తా..9 మంది మృతి

సంగ్లీ: పడవ ప్రమాదంలో 9 మంది మరణించిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది. సంగ్లీ జిల్లాలో బుధవారం 30 మందితో బయల్దేరిన పడవ వరద ఉద్ధృతి ధాటికి బోల్తా పడింది. ఈ ఘటనలో చనిపోయిన 9 మంది మృతదేహాలను గురువారం బయటకి తీశారు. మరో మూడు మృతదేహాలు వరదలో కొట్టుకొని పోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

మిగతావారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చామన్నారు. వారం రోజులుగా కొల్హాపూర్‌, సంగ్లీ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని ఐఎండీ హెచ్చరించింది.

Latest Updates