ఊహించని స్థాయిలో బయటపడుతున్న మృతదేహాలు

హైదరాబాద్ : వరద తగ్గటంతో మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఊహించని స్థాయిలో మృతదేహాలు లభించటం ఆందోళన కలిగిస్తుంది. కర్మాన్ ఘాట్ .. సింగరేణి కాలనీలోని పార్క్ దగ్గర ఒక వ్యక్తి మృతదేహం లభించింది. డెడ్ బాడీ దగ్గర లభించిన ఆధార్ కార్డ్ ఆధారంగా.. అహసాన్ ఉల్లాఖాన్ గా గురించారు పోలీసులు. గగన్ పహాడ్ బ్రిడ్జి దగ్గర 43 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అది ఇండిగో ఎయిర్ లైన్స్ ఉద్యోగి.. ఎన్.మాధవరావుదిగా గుర్తించారు. ఇతను ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఇంజాపూర్ వాగులో కొట్టుకుపోయిన ప్రదీప్, ప్రణయ్ యువకుల డెడ్ బాడీలు లభించాయి. వీళ్లు తొర్రూరు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. వీరిద్దరూ మంగళవారం మిస్సింగ్ అయినట్లు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నాగోల్ బండ్లగూడ మల్లికార్జున నగర్ లో మంగళవారం రాత్రి వరదలో కొట్టుకుపోయిన.. పోస్ట్ మ్యాన్ సుందరరాజు.. డెడ్ బాడీ నాగోల్ చెరువులో లభ్యమైంది. డెడ్ బాడీని ఉస్మానియాకు తరలించారు పోలీసులు.

Latest Updates