కరోనాతో చనిపోయాక కూడా ఆ బాడీ నుంచి వైరస్ సోకుతుందా..?

కరోనాతో మరణించిన మృతదేహాలపై డబ్ల్యూహెచ్ఓ క్లారిటీ ఇచ్చింది. మృతదేహాల వల్ల కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందన్న అనుమానాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేసింది. మనదేశంలో రెండో కరోనా కేసు నమోదైన ఢిల్లీకి చెందిన 68ఏళ్ల మహిళ వైరస్ తో మృతి చెందింది. ఆ మహిళ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించేందుకు బాధితురాలి కుటుంబ సభ్యులు నిగంబోద్ స్మశాన వాటికకు తీసుకువచ్చారు. అయితే స్మశాన వాటిక నిర్వాకులు మహిళ డెడ్ బాడీని దహన సంస్కారం చేసేందుకు ఒప్పుకోలేదు. కరోనాతో మరణించిన డెడ్ బాడీ వల్ల వైరస్ సోకుతుందనే ఉద్దేశంతో తిరస్కరించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో స్పందించిన కేంద్రం నిగంబోద్ ఘాట్ అధికారులకు బాధితురాలి మృతదేహానికి దహన సంస్కారం  చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలతో  రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి నిపుణుల ఆద్వర్యంలో మృతదేహాన్ని సీఎన్‌జీ సదుపాయంతో దహన సంస్కారం చేశారు.  అదే సమయంలో కరోనా వైరస్ తో మరణించిన మృతదేహాల వల్ల కరోనా వైరస్ వ్యాపిస్తుందా..? లేదా అన్న అంశాలపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.

మృతదేహాల వల్ల కరోనా వ్యాపిస్తుందా..?

కరోనా తో మరణించిన  వారి మృతదేహాల నుంచి వైరస్ సోకుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్ ఓ ప్రకటించింది.కరోనా తో మరణించిన వారి డెడ్ బాడీల్లో వైరస్ ఎక్కువ కాలం జీవించదని క్లారిటీ ఇచ్చింది. కలరా లేదా,  డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ వంటి జబ్బులతో మరణించిన వారి డెడ్ బాడీల నుంచి అతి తక్కువ స్థాయిలో ప్రమాదం ఉందని తెలిపింది. అయితే నిరంతరం డెడ్ బాడీలకు దహన సంస్కారాలు నిర్వహించే వ్యక్తులకు ప్రమాదం ఉందని సూచించింది. క్షయ, బ్లడ్ ఇన్ఫెక్షన్లు, జీర్ణశయా అంటువ్యాధుల సోకే ప్రమాదం ఉందని  డబ్ల్యూహెచ్ ఓ తెలిపింది.

కరోనా వైరస్ తో మరణించిన మృతదేహాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కరోనా వైరస్ తో మరణించిన వారి మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఈ జాగ్రత్తలు దహన సంస్కారాలు నిర్వహించే వ్యక్తులు, సాధారణ ప్రజలు తప్పని సరిగా తెలుసుకోవాలని సూచించింది.

ఇది కాకుండా, కరోనాతో మరణించిన లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మరణించిన  మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించే వ్యక్తులకు డబ్ల్యూహెచ్ ఓ కొన్ని నిర్దిష్ట సలహాలను జారీ చేసింది, అవి:

తాగునీటి కోసం ఉపయోగించే పైప్ లైన్లు స్మశాన వాటికలకు కనీసం 30 మీటర్ల దూరంలో ఉండాలి  

సమాధులు నీటి మట్టానికి  కనీసం 1.5 మీ పైన ఉండాలి

⇒ స్మశాన వాటికల నుంచి వచ్చే నీరు నివాస ప్రాంతాల్లోకి వెళ్ల కూడదు.

⇒ డెడ్ బాడీల నుంచి రక్తం కారుతున్నా, బాడీ డీ కంపోజ్ కాకుండా ఉపయోగించే ద్రవాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

గ్లౌజ్ లను తొడుక్కోవాలి. దహన సంస్కారాలు పూర్తయిన వెంటనే తీసివేయాలి

బాడీ బ్యాగ్స్  తప్పని సరిగా ధరించాలి

దహన సంస్కారాలు నిర్వహించిన అనంతరం తప్పని సరిగా చేతులు సబ్బుతో క్లీన్ చేసుకోవాలి

⇒ వాహనాలకు వైరస్ సోకకుండా ఉండేలా క్రిమిసంహారక మందుల్ని వాడాలి

హిపటైటిస్ లాంటి వ్యాధులు రాకుండా టీకాలు వేసుకోవాలి

⇒ దహన సంస్కారాలకు ముందు వైరస్ సోకుండా వ్యాక్సిన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. (కలరా విషయంలో తప్ప)

 

Latest Updates